ఎస్సీ సెల్ బలోపేతానికి కృషి చేస్తా: అమృతరావు
రుద్రంపూర్ (తెలంగాణ వాణి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శిగా నూతనంగా నియమితులైన గిడ్ల అమృతరావును ఐఎన్‌టీయూసీ కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎం.డి. రజాక్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అమృతరావుకు శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అమృతరావు మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో ఎస్సీ సెల్‌ను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి శాయశక్తులా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ నాయకులు సత్తార్, పోశం శ్రీనివాస్, అశోక్, గౌస్, వెంకట్రాం, వెంకటస్వామి, శివరాం, గిరిబాబు, ప్రభాకర్, సీహెచ్. భరత్, మహేష్, సంజయ్, అన్వార్, దిలీప్, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.





