డిండి సెప్టెంబర్ 14( తెలంగాణ వాణి ప్రతినిధి) డిండి మండలంలోని నిజాం నగర్ గ్రామపంచాయతీకి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇంజమూరి కృష్ణయ్య పెద్ద కుమారుడు ఇంజమూరి సత్యనారాయణ అకాల మరణం చెందడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థికంగా అండగా నిలిచారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లట్టుపల్లి పురుషోత్తం రెడ్డి 10,000/- పదివేల రూపాయలు, నల్లవెల్లి దామోదర్ రెడ్డి 5,000/- ఐదు వేల రూపాయలు అలాగే నిజాం నగర్ గ్రామపంచాయతీకి చెందిన పలు కుటుంబాలు, విద్యావంతులు, యువకులు తదితరులు కలిసి 33,000/-ముపైముడు వేల ఆర్థిక సహాయాన్ని అందించారు.
మొత్తం 48,000 /- నలభై ఎనిమిది వేల ఆర్థిక సహాయాన్ని అందించి, విషాదంలో ఉన్న కుటుంబానికి తమ వంతు మానవతా సహకారం అందించారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఆర్థిక సహాయం అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. కష్టకాలంలో బాధిత కుటుంబానికి అండగా నిలవడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు




