UPDATES  

 కేటీఆర్ కు ఘన స్వాగతం పలికిన బారాస శ్రేణులు

ధర్మారం (తెలంగాణ వాణి) మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో జరిగే భారీ రైతు సదస్సుకు వెళ్తున్న మాజీ మంత్రి బారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుకు సోమవారం ధర్మారం మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో భరాస శ్రేణులు, మహిళలు ఘన స్వాగతం పలికారు. ఆయనకు గజమాలవేసి పూలు చల్లి కెసిఆర్, కేటీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ కార్యకర్తలు ఉత్సాహం చూపించారు. మహిళా నాయకురాళ్లు కేటీఆర్ కు నుదుట తిలకం దిద్దేందుకు పోటి పడ్డారు. కేటీఆర్ రాకకు ముందు మహిళా నాయకురాల్లు బతుకమ్మలు పేర్చుకువచ్చి చౌరస్తాలో బతుకమ్మ పాటలు పాడారు. ఈ సందర్భంగా ధర్మారం మండల కేంద్రంలో వందలాదిమంది పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు రోడ్డుకు ఇరువైపులా చేరి పూలవర్షం కురిపించి అభిమానం చూపించారు, జై కేసీఆర్ జై బి ఆర్ ఎస్ అంటూ నినాదాలు చేశారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బారాస శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest