UPDATES  

NEWS

కవితక్క కొత్త పార్టీ పేరు TRS జనాభా గణన 2027 శిక్షణ కార్యక్రమం ప్రారంభం – పాల్వంచలో 36 మందికి ట్రైనింగ్ ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం… వేములవాడలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సాంకేతిక విజ్ఞానానికి వారధి… హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్! కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి హ్యాండ్ బోర్ మరమ్మతు – ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారం:కార్పొరేటర్ కళావతిధనరాజ్ కాంగ్రెస్ నాయకులకు కాకులమర్రి లక్ష్మణ్ బాబు భయం పట్టుకుంది అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్  సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్,

 కవితక్క కొత్త పార్టీ పేరు TRS

పార్టీ పేరు TRS (తెలంగాణ రాష్ట్ర సేన) ప్రకటించిన కవిత 

అప్పటి టీఆర్ఎస్ కోసం రక్తం , చెమట ధార పోశా

కాళేశ్వరంలో అవినీతి జరిగింది నిజం 

అది చెప్పినందుకు నన్ను పార్టీ నుంచి వెళ్లగొట్టారు 

బీజేపీకి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇష్టం లేదు

పార్టీ ఆవిర్భావ సభలో కవిత సంచలన వ్యాఖ్యలు 

 

హైదరాబాద్ (తెలంగాణ వాణి) తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కల్వకుంట్ల కవిత తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ‘తెలంగాణ రాష్ట్ర సేన (TRS)’ పేరుతో పార్టీ పేరును ప్రకటించిన కవిత పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు మాట్లాడుతు తెలంగాణలో కొత్త విప్లవానికి నాంది మొదలైందని అన్నారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణలో నూతన రాజకీయ శక్తిగా రాబోతున్నామన్నారు. ఇది తన జీవితంలో మర్చిపోలేని రోజని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరి భాగస్వామ్యం అవసరమని పిలుపునిచ్చారు. తెలంగాణ కోసం ఎన్నో కష్టాలు పడి పిడికిలి బిగించి కొట్లాడామని.. ఉద్యమంలో ఎంతో మంది ప్రాణాలు అర్పించారని గుర్తుచేశారు.

ఉద్యమంలో బతుకమ్మను ఎత్తుకుని ఊరూరా తిరిగానని.. బతుకమ్మ వచ్చిన తర్వాత ఉద్యమానికి ఊపొచ్చిందని కవిత అన్నారు. తెలంగాణ ఏర్పడి 12 ఏళ్లైనా ప్రజల కలలు నెరవేరలేదని విమర్శించారు. కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ఉద్యమ రథం దారితప్పిందని వ్యాఖ్యానించారు. బానిస సంకెళ్లు పోతాయనుకుంటే పేదలకు దెబ్బలు పడ్డాయన్నారు. తెలంగాణ ఉద్యమంలో జాగృతి కీలకపాత్ర పోషించిందని చెప్పుకొచ్చారు. పదేళ్లు పాలించిన కుటుంబంలో తానూ భాగమైనందుకు సిగ్గుపడుతున్నానంటూ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. దానికి కేవలం క్షమాపణ చెబితే సరిపోదన్నారు. ప్రాయశ్చిత్తం కోసమే ప్రజల ముందుకు టీఆర్‌ఎస్‌తో వస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ఆత్మను బీఆర్‌ఎస్ కోల్పోయిందన్నారు. తెలంగాణ ప్రజలకు ఒక అమ్మగా ఉండాలనుకుంటున్నానని అన్నారు. సామాజిక తెలంగాణ సాధన కోసం పనిచేస్తానని కవిత స్పష్టం చేశారు. బీజేపీకి తెలంగాణ ఏర్పాటు ఇష్టం లేదని కవిత విమర్శించారు. తెలంగాణ విభజనను పాకిస్థాన్‌తో పోల్చారని మండిపడ్డారు. రాష్ట్ర బీజేపీ ఎంపీలు కేంద్రానికి బానిసలంటూ దుయ్యబట్టారు. ఏపీలో కలిపిన ఐదు గ్రామాలను తెలంగాణకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. సామాజిక తెలంగాణను కేసీఆర్ సాధించలేకపోయారని విమర్శించారు. అప్పటి టీఆర్‌ఎస్‌కు తన రక్తాన్ని దారపోశానని చెప్పుకొచ్చారు. ఆనాటి కేసీఆర్‌ వేరు..ఈనాటి కేసీఆర్‌ వేరు. ఆనాటి కేసీఆర్‌ చేనేత కార్మికుల కోసం బిక్షాటన చేశారు. ఈనాటి కేసీఆర్‌ మన మనిషి కాదు.. మర మనిషి. ఏ కష్టమొచ్చినా ఆ సార్‌ ఇప్పుడు రారు.. ఎందుకంటే ఆయన మరమనిషి. గుంటనక్కలు, తోడేళ్ల చేతుల్లో కేసీఆర్‌ బందీ అయ్యారు. ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ సరిగా పాలించలేదు. అందుకే సరైన ఫలితాలు రాలేదు. ఇప్పుడు పేదల ఇళ్లు కూలగొడుతుంటే ఆదుకోవాల్సిన ఆయన ఏం చేస్తున్నారు?. గతంలో టీఆర్‌ఎస్‌ కోసం ఆస్తులు అమ్ముకుని పని చేశారు. వాళ్లంతా ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?. ఉద్యమకారుల్ని ఇబ్బంది పెడుతుంటే పార్టీ అధినేత ఆనాడు ఎందుకు స్పందించలేదు. కేసీఆర్‌ హయాంలో ఒక్క ఉద్యమకారుడికి కూడా పదవి దక్కలేదు. దీనిపై ఆనాడే నేను పోరాడాల్సి ఉండేది. అదే నా తప్పైంది. ఆనాడు ఉద్యమకారులకు జరిగిందే ఇవాళ నాకు జరిగింది. బీఆర్‌ఎస్‌ పార్టీలో అమ్మతనం పోయింది.. మమకారం పోయింది. కేసీఆర్‌ పంజాబ్‌ వెళ్లారు. మన కేసీఆర్‌ అయ్యింటే తెలంగాణ బిడ్డలు కష్టపడి బయటకు వచ్చేవారు. మారుతారామోనని చూశా కానీ నన్నే సస్పెండ్‌ చేశారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందనే నేను చెప్పడమే తప్పా?. తప్పు చేయని నన్ను పార్టీ నుంచి పంపించేశారు. నా బిడ్డ, కొడుకు తప్పు చేస్తే తీసేస్తానని ఆనాడు కేసీఆర్‌ చెప్పారు. అవినీతి జరిగిందన్నందుకు నన్నే బయటకు పంపించేసి.. అవినీతి చేసిన పందికొక్కుల్ని పక్కన పెట్టుకున్నారు. ఆయన మారిపోయారు కాబట్టే నేను యుద్ధం చేస్తున్నా. ఇది ఆరంభం మాత్రమే ముందుంది ముసళ్ల పండుగ” అంటూ కవిత ప్రసంగించారు. ప్రజలకు కష్టం వస్తే కేసీఆర్ రారని అన్నారు. పేదల ఇళ్లు కూలుతుంటే కేసీఆర్ ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ‘నాకు తండ్రి కావొచ్చు.. కానీ కేసీఆర్ రాజకీయ పరిణితి కోల్పోయారు’ అంటూ కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నేను మీ అమ్మను.. తల్లి జేబు చూడదు, కడుపు చూస్తుంది’ అంటూ వ్యాఖ్యానించారు. దళితబంధు పథకంపై స్పందించిన కవిత.. ఒక్క ఉపఎన్నిక కోసమే దళితబంధు అమలు చేశారని ఆరోపణలు గుప్పించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చాక ప్రతి అమరవీరుడి కుటుంబానికి కోటి రూపాయలు సాయం అందిస్తామన్నారు. ఆడబిడ్డల భద్రతపై ప్రధాన అంశంగా పనిచేస్తామని స్పష్టం చేసిన కవిత పాంచజన్యం పేరుతో ఐదు హామీలు ప్రకటించారు. “1. విద్య: ప్రైవేట్‌ స్కూళ్లలో కూడా ఫ్రీగా విద్య అందిస్తాం.. 2. వైద్యం: ఏ రోగమైనా రానీ, ఏ ఆస్పత్రైనా సరే ఉచితంగా అందిస్తాం.. 3. వ్యవసాయం: రైతే రాజు అన్న నినాదాన్ని నిజం చేస్తాం.. 4. ఉపాధి: రూ.2 లక్షల-రూ.20 కోట్ల వరకు యువతకు రుణాలు.. మొదటి ఏడాదిలోనే సింగిల్‌ నోటిఫికేషన్‌లో 4 లక్షల ఉద్యోగాలు.. ఉద్యమకారులకు లక్ష సూపర్‌ న్యూమరీ ఉద్యోగాలు ఇస్తాం.. 5. సామాజిక న్యాయం సాధించాల్సిందే” అని ప్రకటించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest