UPDATES  

 లంచం మత్తులో ఖాకీలు సీఐ, ఎస్సైలపై ఎస్పీ వేటు

– తహసీల్దార్ ఆర్డర్లకే దిక్కులేదు

– తిమ్మాపూర్ సీఐ,ఎస్సైల అరాచక వసూళ్లపై సీపీ సంచలన వేటు

– జేసీబీ,ట్రాక్టర్ల రిలీజ్ కోసం లక్ష డిమాండ్  వైన్ షాప్‌లో “ఫోన్ పే” వసూళ్లు

– అధికారికంగా చలానాలు కట్టినా, తహసీల్దార్ఆర్డరిచ్చినా తగ్గని ఖాకీల బరితెగింపు

తిమ్మాపూర్,అక్టోబర్ 5 (తెలంగాణ వాణి ప్రతినిధి):

ఖాకీల అండతో ఎవరిని పడితే వారిని పీడించవచ్చు.. చట్టాలు, నిబంధనలు మా కింది చుట్టే అనుకున్న కొందరు పోలీసు అధికారుల ఆటలు సాగలేదు. బాధితుల కన్నీళ్లను బేరం పెట్టి, ప్రభుత్వ ఉత్తర్వులనే బేఖాతరు చేస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడిన తిమ్మాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బొల్లం రమేష్, ఎల్ఎండీ ఎస్సై అన్వర్‌లతో పాటు ఓ కానిస్టేబుల్‌‌ను జిల్లా సీపీ ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ సంచలన ఆదేశాలు జారీ చేశారు.తిమ్మాపూర్ మండల కేంద్రానికి చెందిన బాబు అనే వ్యక్తికి చెందిన జేసీబీ, ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు.వాటిని విడిపించుకోవడానికి వెళ్లిన బాధితుడిని చూసి సీఐ రమేశ్, ఎస్సై అన్వర్ కక్కుర్తి పడ్డారు. వాహనాలు రోడ్డెక్కాలంటే రూ. లక్ష ఇవ్వాల్సిందేనంటూ హుకుం జారీ చేశారు. బాధితుడు బ్రతిమిలాడటంతో రూ. 50 వేలకు బేరం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా మొదట రూ. 10 వేలు నగదు రూపంలో గుంజారు. ఆ తర్వాత మిగతా సొమ్ములో రూ. 20 వేలను నేరుగా స్థానిక విఘ్నేశ్వర వైన్స్ నిర్వాహకులకు ఫోన్ పే చేయించుకున్నారు. ఆ డబ్బులను ఒక కానిస్టేబుల్ ద్వారా గుంజుకుని ఖాకీలు తమ వక్రబుద్ధిని చాటుకున్నారు.నిబంధనల ప్రకారం బాధితుడు బాబు ప్రభుత్వ ఖజానాకు ట్రాక్టర్లకు రూ. 15 వేలు, జేసీబీకి రూ. 10 వేల చొప్పున డీడీలు కట్టి చలానాలు సమర్పించాడు. ఇవన్నీ పరిశీలించిన తిమ్మాపూర్ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి సదరు వాహనాలను తక్షణమే విడుదల చేయాలంటూ స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు. తహసీల్దార్ రిలీజ్ ఆర్డర్ కాపీని పట్టుకుని ఎల్ఎండీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన బాధితుడికి స్టేషన్లో ఊహించని షాక్ తగిలింది. తహసీల్దార్ ఆర్డరిస్తే మాకేంటి.. మాకు ఇవ్వాల్సిన లక్ష ఇస్తేనే బండి బయటకు వెళ్తుంది.. లేదంటే మీ బండ్లను కోర్టుకు పంపిస్తాం అంటూ స్టేషన్ లోనే విచక్షణారహితంగా బెదిరింపులకు దిగారు.ఖాకీల బరితెగింపుతో మనోవేదనకు గురైన బాధితుడు దిక్కుతోచని స్థితిలో మీడియాను ఆశ్రయించి తన గోడును వెళ్లబోసుకున్నాడు. ఈ దారుణ వసూళ్ల వ్యవహారంపై సోమవారం ప్రముఖ దినపత్రికల్లో వచ్చిన కథనాలు పోలీసుశాఖలో ప్రకంపనలు సృష్టించాయి. ఈ ఉదంతంపై తీవ్రంగా స్పందించిన జిల్లా సీపీ వెంటనే అంతర్గత విచారణకు ఆదేశించారు. ప్రాథమిక విచారణలో లంచం డిమాండ్లు, ఫోన్ పే వసూళ్లు, తహసీల్దార్ ఆర్డర్లను బేఖాతరు చేసిన వైనం అన్నీ అక్షరాల నిజమని తేలడంతో.. సీఐ రమేష్, ఎస్సై అన్వర్, సహకరించిన కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేయడమే తరువాయి అన్నట్లుగా ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌కు పంపిస్తూ అడుగులు వేయించారు. రక్షించాల్సిన పోలీసులే దోపిడీకి దిగితే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో ఈఘటన మరోసారి నిరూపించింది.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 5 October 2026, 8:45 pm Posted by : TELANGANA VANI

లంచం మత్తులో ఖాకీలు సీఐ, ఎస్సైలపై ఎస్పీ వేటు

- తహసీల్దార్ ఆర్డర్లకే దిక్కులేదు
- తిమ్మాపూర్ సీఐ,ఎస్సైల అరాచక వసూళ్లపై సీపీ సంచలన వేటు
- జేసీబీ,ట్రాక్టర్ల రిలీజ్ కోసం లక్ష డిమాండ్  వైన్ షాప్‌లో "ఫోన్ పే" వసూళ్లు
- అధికారికంగా చలానాలు కట్టినా, తహసీల్దార్ఆర్డరిచ్చినా తగ్గని ఖాకీల బరితెగింపు
తిమ్మాపూర్,అక్టోబర్ 5 (తెలంగాణ వాణి ప్రతినిధి):
ఖాకీల అండతో ఎవరిని పడితే వారిని పీడించవచ్చు.. చట్టాలు, నిబంధనలు మా కింది చుట్టే అనుకున్న కొందరు పోలీసు అధికారుల ఆటలు సాగలేదు. బాధితుల కన్నీళ్లను బేరం పెట్టి, ప్రభుత్వ ఉత్తర్వులనే బేఖాతరు చేస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడిన తిమ్మాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బొల్లం రమేష్, ఎల్ఎండీ ఎస్సై అన్వర్‌లతో పాటు ఓ కానిస్టేబుల్‌‌ను జిల్లా సీపీ ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ సంచలన ఆదేశాలు జారీ చేశారు.తిమ్మాపూర్ మండల కేంద్రానికి చెందిన బాబు అనే వ్యక్తికి చెందిన జేసీబీ, ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు.వాటిని విడిపించుకోవడానికి వెళ్లిన బాధితుడిని చూసి సీఐ రమేశ్, ఎస్సై అన్వర్ కక్కుర్తి పడ్డారు. వాహనాలు రోడ్డెక్కాలంటే రూ. లక్ష ఇవ్వాల్సిందేనంటూ హుకుం జారీ చేశారు. బాధితుడు బ్రతిమిలాడటంతో రూ. 50 వేలకు బేరం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా మొదట రూ. 10 వేలు నగదు రూపంలో గుంజారు. ఆ తర్వాత మిగతా సొమ్ములో రూ. 20 వేలను నేరుగా స్థానిక విఘ్నేశ్వర వైన్స్ నిర్వాహకులకు ఫోన్ పే చేయించుకున్నారు. ఆ డబ్బులను ఒక కానిస్టేబుల్ ద్వారా గుంజుకుని ఖాకీలు తమ వక్రబుద్ధిని చాటుకున్నారు.నిబంధనల ప్రకారం బాధితుడు బాబు ప్రభుత్వ ఖజానాకు ట్రాక్టర్లకు రూ. 15 వేలు, జేసీబీకి రూ. 10 వేల చొప్పున డీడీలు కట్టి చలానాలు సమర్పించాడు. ఇవన్నీ పరిశీలించిన తిమ్మాపూర్ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి సదరు వాహనాలను తక్షణమే విడుదల చేయాలంటూ స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు. తహసీల్దార్ రిలీజ్ ఆర్డర్ కాపీని పట్టుకుని ఎల్ఎండీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన బాధితుడికి స్టేషన్లో ఊహించని షాక్ తగిలింది. తహసీల్దార్ ఆర్డరిస్తే మాకేంటి.. మాకు ఇవ్వాల్సిన లక్ష ఇస్తేనే బండి బయటకు వెళ్తుంది.. లేదంటే మీ బండ్లను కోర్టుకు పంపిస్తాం అంటూ స్టేషన్ లోనే విచక్షణారహితంగా బెదిరింపులకు దిగారు.ఖాకీల బరితెగింపుతో మనోవేదనకు గురైన బాధితుడు దిక్కుతోచని స్థితిలో మీడియాను ఆశ్రయించి తన గోడును వెళ్లబోసుకున్నాడు. ఈ దారుణ వసూళ్ల వ్యవహారంపై సోమవారం ప్రముఖ దినపత్రికల్లో వచ్చిన కథనాలు పోలీసుశాఖలో ప్రకంపనలు సృష్టించాయి. ఈ ఉదంతంపై తీవ్రంగా స్పందించిన జిల్లా సీపీ వెంటనే అంతర్గత విచారణకు ఆదేశించారు. ప్రాథమిక విచారణలో లంచం డిమాండ్లు, ఫోన్ పే వసూళ్లు, తహసీల్దార్ ఆర్డర్లను బేఖాతరు చేసిన వైనం అన్నీ అక్షరాల నిజమని తేలడంతో.. సీఐ రమేష్, ఎస్సై అన్వర్, సహకరించిన కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేయడమే తరువాయి అన్నట్లుగా ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌కు పంపిస్తూ అడుగులు వేయించారు. రక్షించాల్సిన పోలీసులే దోపిడీకి దిగితే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో ఈఘటన మరోసారి నిరూపించింది.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest