
వేములవాడ,అక్టోబర్ 04 (తెలంగాణ వాణి ప్రతినిధి) : వేములవాడలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ను రాజన్న హిల్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు కొల్లూరి శ్రీనివాస్ మాట్లాడుతూ జర్నలిస్టు కాలనీలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టు కాలనీకి ఎమ్మెల్యే స్వయంగా విచ్చేసి, అక్కడి సమస్యలను పరిశీలించి, జర్నలిస్టుల సంక్షేమానికి మరిన్ని ప్రోత్సాహకాలు, సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జుట్టు మల్లేశం, రైకన్నపేట శ్రీనివాస్, కోడం కనకయ్య, సాగర్ల నరేందర్, చీకటిమల్ల చంద్రశేఖర్,తాటిపల్లి నరసింహస్వామి, దూస రాజేందర్, కొల్లూరి సంతోష్, చందనం ప్రవీణ్ పాల్గొన్నారు.
Generating image…