UPDATES  

 సంస్కృతి ఇంటర్నేషనల్‌ స్కూల్‌ సీజ్‌ చేసిన విద్యాశాఖ అధికారులు

శేరిలింగంపల్లి, అక్టోబర్‌ 5 (తెలంగాణ వాణి):

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్‌ డివిజన్‌ గోల్డెన్‌ టులిప్‌లోని సంస్కృతి ఇంటర్నేషనల్‌ స్కూల్‌ను విద్యాశాఖ అధికారులు సీజ్‌ చేశారు. పాఠశాల అనుమతులు, నిబంధనలపై విద్యార్థి నాయకులు చేసిన వరుస ఫిర్యాదులు, సుదీర్ఘ పోరాటం నేపథ్యంలో డీఈఓ ఆదేశాల మేరకు మండల విద్యాశాఖ అధికారి వెంకటయ్య ఆధ్వర్యంలో అధికారులు ఈ చర్యలు చేపట్టారు. సుమారు 1,500 మంది విద్యార్థులు చదువుతున్న ఈ పాఠశాల సుమారు 4,000 గజాల స్థలంలో కొనసాగుతున్న నేపథ్యంలో అనుమతులు, నిబంధనల ఉల్లంఘనలు, విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఫీజులు తదితర అంశాలపై సమగ్ర విచారణ చేపట్టాలని విద్యార్థి నాయకులు డిమాండ్‌ చేశారు. కేవలం పాఠశాలకు తాళం వేయడంతో సమస్య పరిష్కారం కాదని, పాఠశాల నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు. విచారణలో నిబంధనల ఉల్లంఘనలు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. విద్యార్థుల భవిష్యత్తు, తల్లిదండ్రుల నమ్మకాన్ని కాపాడేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, సీజ్‌తోనే ప్రక్రియను నిలిపివేయకుండా పూర్తిస్థాయి విచారణ జరిపే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బైరు నాగరాజు గౌడ్‌ (నవ తెలంగాణ స్టూడెంట్‌ యూనియన్‌), ఓయూ శంకర్‌ (టీవీఐవీ/ఓయూ జేఏసీ), రణధీర్‌ రెడ్డి, బబ్లు గౌడ్‌ (జస్వంత్‌) (బీసీ సంఘం), బొప్పని ఈశ్వర్‌ (బహుజన సంఘ్‌), గణేష్‌ (ఓయూ జేఏసీ) తదితరులు పాల్గొన్నారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 6 October 2026, 7:33 am Posted by : TELANGANA VANI

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest