వనమా రాఘవ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు
బట్టు మంజుల దంపతుల ఆధ్వర్యంలో పూజలు..
ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్ష
పాల్వంచ (తెలంగాణ వాణి) డైనమిక్ లీడర్ వనమా రాఘవ జన్మదినాన్ని పురస్కరించుకుని బిఆర్ఎస్ పార్టీ పాల్వంచ పట్టణ మహిళా అధ్యక్షురాలు బట్టు మంజుల దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాఘవ జన్మదినం సందర్భంగా ఆలయంలో భక్తిశ్రద్ధలతో పూజలు, ప్రత్యేక అర్చనలు చేపట్టారు. వనమా రాఘవ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కలగాలని స్వామివారిని ప్రార్థించారు. రాజకీయ నాయకుల జన్మదిన వేడుకలను కేవలం కేక్ కటింగ్‌లు, హడావుడి కార్యక్రమాలకే పరిమితం చేయకుండా ఆధ్యాత్మికంగా నిర్వహించడం ద్వారా తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా బట్టు మంజుల దంపతులు వనమా రాఘవకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.




