కరీంనగర్‌లో ముఖ్య కార్యకర్తల సమావేశం నియామక పత్రం అందజేత
కరీంనగర్ టౌన్,అక్టోబరు 4 (తెలంగాణ వాణి ప్రతినిధి):
ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా న్యాయవాది జేరిపోతుల మహేందర్ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం కరీంనగర్‌లో నిర్వహించిన జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు మామిడిపల్లి బాపయ్య, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు బొంకురి మధుల సమక్షంలో ఆయనకు నియామక పత్రం అందజేశారు. అంబేద్కర్ ఆశయాలు, సామాజిక న్యాయం, సమానత్వం కోసం కార్యకర్తలు నిబద్ధతతో పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు. సంఘాన్ని గ్రామ, మండల, జిల్లా స్థాయుల్లో మరింత బలోపేతం చేయాలని సూచించారు. తనపై నమ్మకంతో మరోసారి అవకాశం కల్పించిన నాయకులు, కార్యకర్తలకు మహేందర్ కృతజ్ఞతలు తెలిపారు. గత కార్యక్రమాలను విస్తృతం చేసి సంఘాన్ని మరింత బలోపేతం,చేస్తానన్నారు.కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వంతడుపుల సంపత్, కంపెళ్లి సతీష్, కాల్వల రామచంద్రం, సాంబారి కొమురయ్య, చుంచు లత శ్రీ, బూత్కూరు కాంత, వంతడుపుల బాబు, జిల్లా నాయకులు మాడుగుల ఓదెలు, పారునంది జలపతి, కోహెడ మురళి, సుధీర్, వెంకటేష్, అందె వెంకటేశ్వరరావు, సంగుపట్ల మల్లేశం, దేవునూరి కిష్టయ్య, అరుణ్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.



