మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన పొట్యాల ఉప సర్పంచ్ బొండ్ల సురేష్
పెద్దపల్లి : అక్టోబర్, 3 (తెలంగాణ వాణి జిల్లా ప్రతినిధి)
అంతర్గాం పోలీస్ స్టేషన్ నూతన సబ్ఇన్స్పెక్టర్ (ఎస్సై)గా టి. ఉదయ్ కిరణ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పొట్యాల గ్రామ ఉప సర్పంచ్ బొండ్ల సురేష్ నూతన ఎస్సైని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా బొండ్ల సురేష్ మాట్లాడుతూ అంతర్గాం మండలంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు పోలీస్ శాఖ సేవలు మరింత చేరువ కావాలని ఆకాంక్షించారు. నూతన ఎస్సై టి. ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ ప్రజల భద్రతకు మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన టి. ఉదయ్ కిరణ్కు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు శుభాకాంక్షలు తెలిపారు.



