UPDATES  

NEWS

 వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డితో కలిసి మొక్క నాటిన విశ్వామిత్ర చౌహాన్

వరలక్ష్మీ వ్రతం సందర్భంగా తెలుగు రాష్ట్రాల ఆడపడుచులకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రకృతి ప్రేమికుడు విశ్వామిత్ర చౌహాన్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డితో కలిసి తైవాన్ మామిడి మొక్క నాటారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ పండుగలను ప్రకృతితో మమేకం చేయాలని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని అన్నారు. వేలాది మొక్కలు నాటి పచ్చదనం కోసం కృషి చేస్తున్న విశ్వామిత్ర చౌహాన్‌ను అభినందించారు.విశ్వామిత్ర చౌహాన్ నాటిన ఈ మొక్క 1541వ మొక్క కావడం విశేషం. కార్యక్రమంలో బంజారా సంఘాల జేఏసీ చైర్మన్ వీరు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 21 August 2026, 10:36 pm Posted by : TELANGANA VANI

వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డితో కలిసి మొక్క నాటిన విశ్వామిత్ర చౌహాన్

వరలక్ష్మీ వ్రతం సందర్భంగా తెలుగు రాష్ట్రాల ఆడపడుచులకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రకృతి ప్రేమికుడు విశ్వామిత్ర చౌహాన్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డితో కలిసి తైవాన్ మామిడి మొక్క నాటారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ పండుగలను ప్రకృతితో మమేకం చేయాలని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని అన్నారు. వేలాది మొక్కలు నాటి పచ్చదనం కోసం కృషి చేస్తున్న విశ్వామిత్ర చౌహాన్‌ను అభినందించారు.విశ్వామిత్ర చౌహాన్ నాటిన ఈ మొక్క 1541వ మొక్క కావడం విశేషం. కార్యక్రమంలో బంజారా సంఘాల జేఏసీ చైర్మన్ వీరు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest