మెట్పల్లి:సెప్టెంబర్26(తెలంగాణ వాణి)మెట్పల్లి ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ పద్మ శనివారం సాయంత్రం 63 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ కరీంనగర్ యూనిట్ అధికారులు పట్టుకున్నారు.మెట్పల్లి పట్టణ సెక్టార్ లోని 21 అంగన్వాడి కేంద్రాల నుండి ప్రతినెల ఒక్కో అంగన్వాడి కేంద్రానికి వెయ్యి రూపాయల చొప్పున మూడు నెలలకు సంబంధించిన 63 వేల రూపాయల లంచం ఒకేసారి కావాలని డిమాండ్ చేయగా బాధితులు ఏసీబీని ఆశ్రయించారని తెలిసింది. దీనితో ఏసీబీ అధికారులు శనివారం సాయంత్రం 63 వేల రూపాయలు సిడిపిఓ పద్మ తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.అనంతరం పద్మను కరీంనగర్ ఏసీబీ న్యాయస్థానానికి తీసుకువెళ్లారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


