ధర్మారం (తెలంగాణ వాణి) పాడి పశువులు గొర్రెలు మేకలకు బీమా కల్పించడం హర్షణీయమని గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు జంగ మహేందర్ యాదవ్ పేర్కొన్నారు. పెంపకందారులను ప్రోత్సహించేందుకు తొలిసారిగా పశు సంపద బీమా సౌకర్యం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించడం హర్షణీయమని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా ద్వారా బీమా పథకాన్ని అమలు చేయడం వల్ల గొర్రెలు మేకలు పాడిపశుల పెంపకం దారులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని ఆయన తెలిపారు. మొత్తం బీమా ప్రీమియం లో 85% సమస్త భరించగా, 15% లబ్ధిదారుడు చెల్లించాల్సి ఉంటుందని, గొర్రెలు మేకలు విషపూరితమైన ఆహారం తిని మరణించడం వివిధ రోగాల బారిన పడి మృతి చెందడం వల్ల అనేక కారణాలతో పెంపకం దారులు తీవ్ర నష్టపోతున్నారని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వాల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లిన తగిన పరిష్కారం లభించలేదని, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గొర్రెలు మేకలు పాడి పశువుల పెంపకం దారులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి బీమా సౌకర్యాన్ని కల్పించిన పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. భీమా సౌకర్యాన్ని కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరికి, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు, గొర్రెల మేకల అభివృద్ధి సమైక్య ఎండి సుబ్బారాయుడు కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.



