UPDATES  

NEWS

జనాభా గణన 2027 శిక్షణ కార్యక్రమం ప్రారంభం – పాల్వంచలో 36 మందికి ట్రైనింగ్ ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం… వేములవాడలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సాంకేతిక విజ్ఞానానికి వారధి… హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్! కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి హ్యాండ్ బోర్ మరమ్మతు – ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారం:కార్పొరేటర్ కళావతిధనరాజ్ కాంగ్రెస్ నాయకులకు కాకులమర్రి లక్ష్మణ్ బాబు భయం పట్టుకుంది అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్  సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్, ఖబడ్దార్ బిఆర్ఎస్ నాయకుల్లారా

 సేవాలాల్ సద్గురు చూపిన మార్గం ఆదర్శనీయం: వైరా ఎమ్మెల్యే మాళోత్ రాందాస్ నాయక్

గిరిజన లంబాడీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (GLS JAC) ఆధ్వర్యంలో సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. GLS JAC చైర్మన్ ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ అధ్యక్షతన లక్ష్మీదేవి పల్లి మార్కెట్ యార్డ్ నుండి రైల్వే స్టేషన్ మీదుగా ఎదురుగడ్డ వరకు లంబాడీ సంస్కృతి, సంప్రదాయ నృత్యాల నడుమ భారీ శోభాయాత్ర నిర్వహించారు.
అనంతరం లక్ష్మీదేవి పల్లి మండలం ఎదురుగడ్డలో మహా భోగ్ భండారో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైరా శాసనసభ్యులు మళోత్ రాందాస్ నాయక్ పాల్గొన్నారు. సేవాలాల్ చిత్ర పటానికి పూలమాల వేసి లంబాడి సంస్కృతి సంప్రదాయ పద్ధతిలో మహా భోగ్ బండారో కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ మాట్లాడుతూ మన దేశ వ్యాప్తంగా 15 కోట్ల మంది బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ అని అన్నారు. లంబాడీల ఆదర్శమూర్తి సేవాలాల్ మహారాజ్ జయంతిని దేశ వ్యాప్తంగా తండా తండాలో జరుపుకోవడం హర్షణీయం అని పేర్కొన్నారు. ప్రతి మండల, జిల్లా కేంద్రాలలో సేవాలాల్ మహారాజ్ గుడిని నిర్మించేలా కృషి చేస్తానని తెలిపారు. పార్లమెంట్ భవనంలో సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ప్రతిష్టించేలా కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. సేవాలాల్ మహారాజ్ జయంతిని ప్రభుత్వం జాతర లాగా నిర్వహించాలని అన్నారు. సేవాలాల్ మహారాజ్ భావితరానికి ఆదర్శప్రాయుడని, లంబాడీల జీవనస్థితిగతులు, తండాల స్థిర నివాసం, సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పిన గొప్ప యోధుడని కొనియాడారు.సేవాలాల్ మహారాజ్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించి ఫిబ్రవరి 15వ తేదీన జయంతి మహోత్సవ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తోందని పేర్కొన్నారు.జి.ఎల్.ఎస్ జేఏసీ చైర్మన్ ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో సేవాలాల్ ఆలయం, బంజారా భవన్ నిర్మాణాలకు 5 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కేంద్రంగా నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుని నిధులు మంజూరు చేయాలని కోరారు.కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, ఉప మేయర్ లలిత కుమారి పాల్గొని మాట్లాడారు.ఈ కార్యక్రమంలో మాళోత్ విగ్నేష్ నాయక్, న్యాయవాది రమేష్ నాయక్, వైస్ చైర్మన్ ప్రసాద్ నాయక్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు, PCC ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు, మండే వీర హనుమంత రావు, అర్జున్ రావు, లు హథీరామ్, గడ్డం శ్రీనివాస్, వీరన్న, లావూరి శ్రీనివాస్, ప్రేమ్ చంద్, భోజ్య నాయక్, దేవ్ సింగ్, ఎదురుగడ్డ సర్పంచ్ బట్టు అరుణ్ నాయక్, ఉప సర్పంచ్ భూక్య జయ, జేఏసీ ప్రధాన కార్యదర్శి ధారావత్ సురేష్ నాయక్, వెంకట్ నాయక్, కారుకొండ సర్పంచ్ భారతి బలరాం నాయక్, భట్టు జుంకీలాల్, కృష్ణ, కార్పొరేటర్లు డాక్టర్ స్వప్న, లచ్చిరాం, రతన్ లాల్, కుమార్ లాల్, శంకర్, సాయి కృష్ణ, చంటి, నాగరాజు, సురేష్, దుర్గ ప్రసాద్, శంకర్, రమేష్ బాబు, మోహన్, నాయక్ సేవ్య, రవి రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest