UPDATES  

 సానిటేషన్ స్పెషల్ డ్రైవ్ పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్

వేములవాడ,అక్టోబర్ 08 (తెలంగాణ వాణి ప్రతినిధి) : వేములవాడ పట్టణంలోని 26వ వార్డ్ లో స్థానిక కౌన్సిలర్ మామిండ్ల అమర్శ లక్ష్మిరాజంతో కలిసి సానిటేషన్ స్పెషల్ డ్రైవ్ పనులను మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు పరిశీలించారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు మాట్లాడుతూ పట్టణ పరిశుభ్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా పారిశుద్ధ్య పనులను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.డ్రైనేజీలు,బహిరంగ ప్రదేశాల్లో చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, ప్రజలు కూడా చెత్తను రోడ్డుపై పడ వేయకుండా తడి చెత్తను తడి చెత్తగా పొడి చెత్తను పొడి చెత్తగా వేరుచేసి మున్సిపాలిటీ స్వచ్ఛ ఆటోలకు ఇచ్చి మున్సిపల్ సిబ్బందికి సహకరించగలరని మన పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకుంటేనే పట్టణం కూడా పరిశుభ్రంగా ఉంటుందని అన్నారు.ఆయన వెంట వార్డ్ ఆఫీసర్ వెంకటేష్,మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 8 October 2026, 4:08 pm Posted by : TELANGANA VANI

సానిటేషన్ స్పెషల్ డ్రైవ్ పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్

వేములవాడ,అక్టోబర్ 08 (తెలంగాణ వాణి ప్రతినిధి) : వేములవాడ పట్టణంలోని 26వ వార్డ్ లో స్థానిక కౌన్సిలర్ మామిండ్ల అమర్శ లక్ష్మిరాజంతో కలిసి సానిటేషన్ స్పెషల్ డ్రైవ్ పనులను మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు పరిశీలించారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు మాట్లాడుతూ పట్టణ పరిశుభ్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా పారిశుద్ధ్య పనులను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.డ్రైనేజీలు,బహిరంగ ప్రదేశాల్లో చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, ప్రజలు కూడా చెత్తను రోడ్డుపై పడ వేయకుండా తడి చెత్తను తడి చెత్తగా పొడి చెత్తను పొడి చెత్తగా వేరుచేసి మున్సిపాలిటీ స్వచ్ఛ ఆటోలకు ఇచ్చి మున్సిపల్ సిబ్బందికి సహకరించగలరని మన పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకుంటేనే పట్టణం కూడా పరిశుభ్రంగా ఉంటుందని అన్నారు.ఆయన వెంట వార్డ్ ఆఫీసర్ వెంకటేష్,మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest