నిర్మల్ – భైంసా (తెలంగాణ వాణి ప్రతినిధి) హైదరాబాద్‌కు చెందిన ప్రముఖులు రాజ్‌కుమార్ మదాని, రాధా మదాని దంపతుల కుమార్తె కుమారి శ్రేయ వివాహ వేడుకకు ముధోల్ మాజీ ఎమ్మెల్యే,కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి భోస్లే నారాయణరావు పటేల్ తన సతీమణితో కలిసి కుటుంబ సమేతంగా హాజరయ్యారు. శామీర్‌పేటలోని ఏటీఎన్ఆర్ పుష్ప కన్వెన్షన్ రిసార్ట్‌లో జరిగిన వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, అభిమానులు,బంధుమిత్రులు పాల్గొన్నారు.





