UPDATES  

 స్థానిక కార్మికుల ఉపాధిని కాపాడాలి – ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు

వేములవాడ,అక్టోబర్ 08 (తెలంగాణ వాణి ప్రతినిధి) :రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ ఏఐటీయూసీ కార్మిక భవన్‌లో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు మాట్లాడుతూ.. జిల్లాలో ఉపాధి కోల్పోతున్న కార్మికులను ఆదుకోవడానికి ప్రతిరోజూ ఇసుక, మొరం తోలకానికి అనుమతులు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే కార్మికుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ఎసిఎల్,డిసిఎల్ లతో పాటు శాశ్వత లేబర్ ఆఫీసర్‌ను తక్షణమే నియమించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లేబర్ వెల్ఫేర్ బోర్డు నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఒక సంవత్సరం లీజు పేరుతో కాంట్రాక్టర్లకు కట్టబెడుతూ, లేబర్ కార్డుదారులకు ఉచిత మెడికల్ టెస్టుల నెపంతో బోర్డు నిధులను కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. కాంట్రాక్టు గడువు ముగిసినప్పటికీ పెండింగ్ ఫైళ్లు క్లియర్ కాలేదని, కార్మికుల సమస్యలు అలాగే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే వెంటనే కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేసి, నేరుగా లేబర్ అధికారుల ద్వారానే కార్మికులకు రావలసిన లబ్ధిని అందించాలని స్పష్టం చేశారు.అలాగే 55 సంవత్సరాలు నిండిన కార్మికులకు నెలకు 5,000 పెన్షన్ ఇవ్వాలని, కార్మికుల పిల్లల వివాహానికి ఒక లక్ష, ప్రసవ సమయాల్లో (డెలివరీ) 50 వేల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వలస కార్మికులు రావడం వల్ల స్థానిక కార్మికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి స్థానిక కార్మికుల ఉపాధికి భద్రత కల్పించాలని కోరారు. ​ఈ కార్యక్రమంలో నాయకులు కొత్తపల్లి రవిచారి, ఆనందం తదితరులు పాల్గొన్నారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 8 October 2026, 3:48 pm Posted by : TELANGANA VANI

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest