UPDATES  

NEWS

 ఘనంగా మాన్యవార్ కాన్షిరాం వర్ధంతి వేడుకలు

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, బహుజన నాయకత్వ దార్శనికుడు మాన్యవార్ కాన్షిరాం 20వ వర్ధంతి వేడుకలను సుంచు మల్లేశం ఆధ్వర్యంలో శుక్రవారం ధర్మారం మండలం పత్తిపాక ఎక్స్ రోడ్ లో గల అంబేద్కర్ కూడలి వద్ద ఘనంగా నిర్వహించారు. కాన్షిరామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ..కాన్షిరాం బడుగు బలహీన వర్గాల రాజకీయ హక్కుల కోసం ఆయన చేసిన త్యాగాలను స్మరించుకుంటూ ఆయన ఆశయ సాధనకు ప్రతి బహుజనడు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బహుజనులకు రాజకీయ అధికారం సాధించడమే కాన్సిరాం అంతిమ లక్ష్యం అని పేర్కొన్నారు. బహుజనులు హక్కులు ఆత్మగౌరవం సామాజిక సమానత్వం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానీయుడు కాన్సిరాం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన నాయకులు మెట్పల్లి నరేష్, వాడకాపురం రవి, దీకొండ రమేష్, నేరెళ్ల లక్ష్మీరాజం, నేరెళ్ల దుర్గయ్య, నేరెళ్ల మల్లయ్య, న్యాతరి కనకయ్య, కుమ్మరి రాములు, గడ్డం భూమయ్య, గడ్డం సత్తయ్య, పులి రామయ్య తదితరులు పాల్గొన్నారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 9 October 2026, 4:31 pm Posted by : TELANGANA VANI

ఘనంగా మాన్యవార్ కాన్షిరాం వర్ధంతి వేడుకలు

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, బహుజన నాయకత్వ దార్శనికుడు మాన్యవార్ కాన్షిరాం 20వ వర్ధంతి వేడుకలను సుంచు మల్లేశం ఆధ్వర్యంలో శుక్రవారం ధర్మారం మండలం పత్తిపాక ఎక్స్ రోడ్ లో గల అంబేద్కర్ కూడలి వద్ద ఘనంగా నిర్వహించారు. కాన్షిరామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ..కాన్షిరాం బడుగు బలహీన వర్గాల రాజకీయ హక్కుల కోసం ఆయన చేసిన త్యాగాలను స్మరించుకుంటూ ఆయన ఆశయ సాధనకు ప్రతి బహుజనడు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బహుజనులకు రాజకీయ అధికారం సాధించడమే కాన్సిరాం అంతిమ లక్ష్యం అని పేర్కొన్నారు. బహుజనులు హక్కులు ఆత్మగౌరవం సామాజిక సమానత్వం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానీయుడు కాన్సిరాం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన నాయకులు మెట్పల్లి నరేష్, వాడకాపురం రవి, దీకొండ రమేష్, నేరెళ్ల లక్ష్మీరాజం, నేరెళ్ల దుర్గయ్య, నేరెళ్ల మల్లయ్య, న్యాతరి కనకయ్య, కుమ్మరి రాములు, గడ్డం భూమయ్య, గడ్డం సత్తయ్య, పులి రామయ్య తదితరులు పాల్గొన్నారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest