శాంతియుత వాతావరణంలో గణేష్ నిమర్జనం జరుపుకోవాలని లక్ష్మీదేవి పల్లి ఎస్ఐ అఖిల, ట్రాఫిక్ ఎస్ఐ గడ్డం ప్రవీణ్ కుమార్ సూచించారు.స్థానిక బొడ్రాయి సెంటర్లో వినాయక నవరాత్రుల సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్ఐ అఖిల, ట్రాఫిక్ ఎస్ఐ గడ్డం ప్రవీణ్ కుమార్ విచ్చేసి వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను అభినందించారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ తాటి అనిత, స్థానిక నాయకులు ఎస్ఐలను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూనెం శ్రీనివాస్, తిరుమలేష్, కోటి ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.



