UPDATES  

NEWS

గొర్రెలు, మేకల బీమా పథకం ప్రారంభం శాంతియుత వాతావరణంలో గణేష్ నిమర్జనం జరుపుకోవాలి: ఎస్ఐ అఖిల, ట్రాఫిక్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ పౌష్టికాహారంతోనే చిన్నారుల సంపూర్ణ ఎదుగుదల పిడుగుపాటుతో మహిళా వృద్ధురాలి మృతి వినాయక నిమజ్జనంలో అప్రమత్తంగా ఉండాలి గణనాథున్ని దర్శించుకున్న ఎన్నారై హరీష్ రెడ్డి ప్లాస్టిక్ రహిత గ్రామమే లక్ష్యంగా 200 స్టీల్ ప్లేట్లు విరాళం అత్యవసర సమయంలో రక్తదానం చేసిన బాచికి యంగ్ ఇండియన్ బ్లడ్ డోనార్స్ క్లబ్ భద్రాద్రి జిల్లా కార్యదర్శి జుబ్బు అభినందనలు ఎస్‌జీఎఫ్ క్రీడల్లో శ్రీనిధి గ్లోబల్ స్కూల్ విద్యార్థుల ఘన విజయం లంచం వసూలుకు ‘సర్వీస్‌బుక్‌’ను అడ్డుపెట్టారా?

 గొర్రెలు, మేకల బీమా పథకం ప్రారంభం

ఇందిరాభవన్‌లో పెంపకందారుల సహకార సంఘాల సమావేశం.. ఇద్దరు రాష్ట్ర మంత్రుల రాక

కరీంనగర్ (తెలంగాణ వాణి): కరీంనగర్ జిల్లా గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సంఘం ఆధ్వర్యంలో జిల్లాలోని గొర్రెలు, మేకల పెంపకందారులతో శనివారం ఇందిరాభవన్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గొర్రెలు, మేకల బీమా పథకాన్ని రాష్ట్ర మంత్రులు ప్రారంభించనున్నారు.

రూ.3 వేల నుంచి రూ.8 వేల వరకు ప్రీమియం

ప్రకృతి వైపరీత్యాలు, ఇతర కారణాలతో జీవాలకు నష్టం వాటిల్లే సందర్భాల్లో పెంపకందారులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు బీమా పథకం అందుబాటులోకి వచ్చింది. రూ.3 వేల నుంచి రూ.8 వేల వరకు ప్రీమియం ఉండే బీమా పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను కార్యక్రమంలో మంత్రులు వెల్లడించనున్నారు.

సహకార సంఘాలపై చర్చ

ప్రత్యేక సమావేశంలో జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార సంఘాల ఎన్నికలు, ఆస్తుల పంపిణీ తదితర అంశాలపై చర్చించనున్నారు. నూతనంగా ఎన్నికైన జిల్లా గొర్రెలు, మేకల పెంపకందారుల సహకార సంఘం అధ్యక్షుడు బాసవేని మల్లయ్య అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరగనుంది.

మంత్రులు, అధికారులు హాజరు

రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య, క్రీడలు-యువజన వ్యవహారాల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర రవాణా, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య చైర్‌పర్సన్ సరితా తిరుపతయ్య, మేనేజింగ్ డైరెక్టర్ డా. బి. సుబ్బారాయుడు హాజరుకానున్నారు. ఈ వివరాలను జిల్లా పశువైద్య, పశుసంవర్ధక శాఖాధికారి డా. ఎన్. లింగారెడ్డి తెలిపారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 25 September 2026, 4:18 pm Posted by : TELANGANA VANI

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest