UPDATES  

NEWS

జనగామ జిల్లా కలెక్టర్ తీరుపై జర్నలిస్ట్ నాయకుల ఫిర్యాదు పచ్చని ఔషధ మొక్కలు అందజేసి ఆశీర్వాదం పొందిన చిన్నారి అఫాన్ జైదీ సర్పంచ్ జర్పల దేవి ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం రోడ్డెక్కిన అన్నదాతలు వైన్స్ సిట్టింగ్ రూమ్ లో వ్యక్తి మృతి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం… సరైన రోడ్డు సౌకర్యం లేకా వర్ష కాలం వస్తే రైతులకు కష్టాలే… ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి: గిరిజన సంక్షేమ సంఘం నాయకులు రాంబాబు,ఎంపీ నాయక్ ఉపాధి హామీ కూలీల ప్రాణం తీసుకున్న అతివేగం లక్ష్మీదేవి పల్లి మండలంలో వడదెబ్బకు వ్యవసాయ కూలీ మహిళా మృతి

 జనాభా గణన 2027 శిక్షణ కార్యక్రమం ప్రారంభం – పాల్వంచలో 36 మందికి ట్రైనింగ్

జనాభా గణన 2027 కార్యక్రమం సందర్భంగా ఏప్రిల్ 20 నుండి 25 వరకు నిర్వహించనున్న శిక్షణలో భాగంగా, మొదటి దఫా ఇండ్ల గణన మే 11 నుండి జూన్ 9 వరకు జరగనున్న నేపథ్యంలో పాల్వంచ మండల రూరల్ పరిధిలోని పాత ఆర్డిఓ కార్యాలయంలో సోమవారం ట్రైనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమాన్ని పాల్వంచ మండల తహసిల్దార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ శిక్షణలో భాగంగా మొత్తం 36 మంది ఎన్యుమరేటర్లు మరియు సూపర్వైజర్లు పాల్గొన్నారు.ముఖ్య అతిథిగా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ సంజీవరావు హాజరయ్యారు. మండల గణాంక అధికారి వెంకటేశ్వర్లు, టెక్నికల్ అసిస్టెంట్ లక్ష్మణ్, ఫీల్డ్ ట్రైనర్లుగా జూనియర్ కాలేజీ లెక్చరర్ రవీందర్,ముంతాజ్ అలీ ఖాన్ శిక్షణ అందించారు.ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా జరుగుతున్న జనాభా గణన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించి విజయవంతం చేయాలని కోరారు. వేసవి ఎండలు తీవ్రంగా ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకుంటూ,నిర్ణీత గడువులో శిక్షణ పూర్తి చేసి ఇండ్ల గణనను సక్రమంగా చేపట్టాలని సూచించారు. మండలానికి మంచి పేరు తీసుకురావాలని ప్రభుత్వ ఉపాధ్యాయులను అభ్యర్థించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest