UPDATES  

NEWS

జనాభా గణన 2027 శిక్షణ కార్యక్రమం ప్రారంభం – పాల్వంచలో 36 మందికి ట్రైనింగ్ ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం… వేములవాడలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సాంకేతిక విజ్ఞానానికి వారధి… హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్! కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి హ్యాండ్ బోర్ మరమ్మతు – ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారం:కార్పొరేటర్ కళావతిధనరాజ్ కాంగ్రెస్ నాయకులకు కాకులమర్రి లక్ష్మణ్ బాబు భయం పట్టుకుంది అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్  సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్, ఖబడ్దార్ బిఆర్ఎస్ నాయకుల్లారా

 ఇస్రో యువికా–26కు దరఖాస్తులు ఆహ్వానం: భద్రాది జిల్లా సైన్స్ అధికారి బి.సంపత్ కుమార్

విద్యార్థుల్లో అంతరిక్ష విజ్ఞానంపై ఆసక్తి పెంపొందించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్’ (యువికా–26)కు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.ఈ కార్యక్రమం శాస్త్ర, సాంకేతిక,ఇంజనీరింగ్,గణిత రంగాలపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు మంచి వేదికగా నిలుస్తోంది.ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలల్లో ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.ఎంపికలో 8వ తరగతి మార్కులకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు క్విజ్‌లు,విజ్ఞాన సదస్సులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, గ్రామీణ విద్యార్థులకు వెయిటేజ్ మార్కులు కేటాయిస్తారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 31 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.ఎంపికైన విద్యార్థులకు మే నెలలో 14 రోజులపాటు దేశంలోని ఇస్రో కేంద్రాల్లో శాస్త్ర, సాంకేతిక అంశాలపై రెసిడెన్షియల్ శిక్షణ ఇస్తారు. ప్రయోగాత్మక ప్రదర్శనలు,నిపుణులతో చర్చలు, అంతరిక్ష విజ్ఞానం, రాకెట్ ప్రయోగాలపై అవగాహన కల్పిస్తారు. ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేస్తారు. ఎంపికైన విద్యార్థితో పాటు తల్లిదండ్రుల్లో ఒకరు లేదా మార్గదర్శక ఉపాధ్యాయుడి ప్రయాణ ఖర్చులను ఇస్రో భరిస్తుంది.భావి శాస్త్రవేత్తలకు ఇది మంచి అవకాశమని జిల్లా సైన్స్ అధికారి బి. సంపత్ కుమార్ తెలిపారు. జిల్లాలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest