UPDATES  

NEWS

 భద్రాచలం డివిజన్ లో పి ఆర్ టి యు టి ఎస్ సమావేశం

భద్రాచలం డివిజన్ లో పిఆర్టియు టి ఎస్ ప్రాంతీయ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు దశమ బాబు అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు నర్సయ్య, ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ హాజరై మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో కలిసి జిల్లాలో సంఘ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.అలాగే జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబోయే అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమాలపై సమావేశంలో చర్చ జరిగింది.ఈ సందర్భంగా సీనియర్ నాయకులు దనికొండ శ్రీనివాసరావు,దశమ బాబు,మంగయ్య,నాగులు జిల్లా శాఖకు పలు సూచనలు, సలహాలు అందించారు.ఆ సూచనలు,సలహాలను సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించి తీర్మానించారు.ఈ సమావేశంలో PRASET రాష్ట్ర అధ్యక్షుడు సుమన్,రాష్ట్ర కార్యదర్శులు సురేష్ బాబు,పటేల్,జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు భాస్కర్,లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్షుడు లక్ పతి, భద్రాచలం,దుమ్ముగూడెం, చర్ల,మణుగూరు,అశ్వాపురం మండలాల అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest