UPDATES  

 రేపు వనమా నివాసం వద్ద వేడుకలు..

పార్టీలు, కులమతాలకు అతీతంగా వనమా జన్మదిన వేడుకలకు తరలిరావాలి

మాజీ ఉర్దూ ఘర్ చైర్మన్ అన్వర్ పాషా పిలుపు

కొత్తగూడెం (తెలంగాణ వాణి) మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు 82వ జన్మదిన వేడుకలకు నియోజకవర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ముస్లిం మైనార్టీ నాయకుడు, మాజీ ఉర్దూ ఘర్ చైర్మన్ అన్వర్ పాషా పిలుపునిచ్చారు. రేపు పాత పాల్వంచలోని వనమా నివాసం వద్ద నిర్వహించనున్న జన్మదిన వేడుకల్లో పార్టీలు, కులమతాలకు అతీతంగా పాల్గొని పెద్దాయనకు శుభాకాంక్షలు తెలియజేయాలని కోరారు. ఈ సందర్భంగా అన్వర్ పాషా మాట్లాడుతూ.. కొత్తగూడెం నియోజకవర్గానికి దశ, దిశ నిర్దేశిస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన నాయకుడు వనమా వెంకటేశ్వరరావు అని కొనియాడారు. సాధారణ రైతు కుటుంబం నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా 14 సంవత్సరాలు పనిచేయడంతో పాటు రాష్ట్రంలో సీనియర్ బీసీ నాయకుడిగా, మంత్రిగా విశేష సేవలందించారని గుర్తుచేశారు. కులమతాలకు అతీతంగా నియోజకవర్గంలోని ప్రతి కుటుంబంతో ఆత్మీయ సంబంధాలు కొనసాగిస్తూ, ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకునే వ్యక్తిత్వం వనమా సొంతమని అన్నారు. నవంబర్ 1న వనమా నివాసానికి విచ్చేసి ఆయన ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ జన్మదిన వేడుకలను విజయవంతం చేయాలని అన్వర్ పాషా ప్రజలను కోరారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 31 October 2026, 2:40 pm Posted by : TELANGANA VANI

రేపు వనమా నివాసం వద్ద వేడుకలు..

పార్టీలు, కులమతాలకు అతీతంగా వనమా జన్మదిన వేడుకలకు తరలిరావాలి

మాజీ ఉర్దూ ఘర్ చైర్మన్ అన్వర్ పాషా పిలుపు

కొత్తగూడెం (తెలంగాణ వాణి) మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు 82వ జన్మదిన వేడుకలకు నియోజకవర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ముస్లిం మైనార్టీ నాయకుడు, మాజీ ఉర్దూ ఘర్ చైర్మన్ అన్వర్ పాషా పిలుపునిచ్చారు. రేపు పాత పాల్వంచలోని వనమా నివాసం వద్ద నిర్వహించనున్న జన్మదిన వేడుకల్లో పార్టీలు, కులమతాలకు అతీతంగా పాల్గొని పెద్దాయనకు శుభాకాంక్షలు తెలియజేయాలని కోరారు. ఈ సందర్భంగా అన్వర్ పాషా మాట్లాడుతూ.. కొత్తగూడెం నియోజకవర్గానికి దశ, దిశ నిర్దేశిస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన నాయకుడు వనమా వెంకటేశ్వరరావు అని కొనియాడారు. సాధారణ రైతు కుటుంబం నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా 14 సంవత్సరాలు పనిచేయడంతో పాటు రాష్ట్రంలో సీనియర్ బీసీ నాయకుడిగా, మంత్రిగా విశేష సేవలందించారని గుర్తుచేశారు. కులమతాలకు అతీతంగా నియోజకవర్గంలోని ప్రతి కుటుంబంతో ఆత్మీయ సంబంధాలు కొనసాగిస్తూ, ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకునే వ్యక్తిత్వం వనమా సొంతమని అన్నారు. నవంబర్ 1న వనమా నివాసానికి విచ్చేసి ఆయన ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ జన్మదిన వేడుకలను విజయవంతం చేయాలని అన్వర్ పాషా ప్రజలను కోరారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest