UPDATES  

 ఆరు దశాబ్దాల ప్రజా జీవితం.. రాజకీయ అనుభవానికి ప్రతీక వనమా!

మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావుకు జెడ్పీ మాజీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు జన్మదిన శుభాకాంక్షలు

 

కొత్తగూడెం, (తెలంగాణ వాణి) సుమారు ఆరు దశాబ్దాలుగా ప్రజాజీవితంలో కొనసాగుతూ, వివిధ హోదాల్లో ప్రజలకు సేవలందించిన సీనియర్ నాయకుడు మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు అన్నారు. వనమా 82వ జన్మదినం సందర్భంగా నవంబర్ 1న ఆయనకు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలు వేరైనా ఎన్నో ఏళ్లుగా వనమా వెంకటేశ్వరరావుతో కలిసి పనిచేసిన అనుభవం తనకుందని గుర్తుచేశారు. చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చిన వనమా సర్పంచ్‌గా, మున్సిపల్ చైర్మన్‌గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా వివిధ బాధ్యతలు నిర్వహించి విశేష రాజకీయ అనుభవాన్ని సంపాదించారని పేర్కొన్నారు. కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధిలో వనమా కృషి, ఆయన ముద్ర స్పష్టంగా కనిపిస్తాయని అన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉందని కొనియాడారు. 82వ జన్మదినం జరుపుకుంటున్న వనమా వెంకటేశ్వరరావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, మరింతకాలం ప్రజలకు సేవలందించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు కంచర్ల చంద్రశేఖర్ రావు తెలిపారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 31 October 2026, 2:58 pm Posted by : TELANGANA VANI

ఆరు దశాబ్దాల ప్రజా జీవితం.. రాజకీయ అనుభవానికి ప్రతీక వనమా!

మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావుకు జెడ్పీ మాజీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు జన్మదిన శుభాకాంక్షలు

 

కొత్తగూడెం, (తెలంగాణ వాణి) సుమారు ఆరు దశాబ్దాలుగా ప్రజాజీవితంలో కొనసాగుతూ, వివిధ హోదాల్లో ప్రజలకు సేవలందించిన సీనియర్ నాయకుడు మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు అన్నారు. వనమా 82వ జన్మదినం సందర్భంగా నవంబర్ 1న ఆయనకు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలు వేరైనా ఎన్నో ఏళ్లుగా వనమా వెంకటేశ్వరరావుతో కలిసి పనిచేసిన అనుభవం తనకుందని గుర్తుచేశారు. చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చిన వనమా సర్పంచ్‌గా, మున్సిపల్ చైర్మన్‌గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా వివిధ బాధ్యతలు నిర్వహించి విశేష రాజకీయ అనుభవాన్ని సంపాదించారని పేర్కొన్నారు. కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధిలో వనమా కృషి, ఆయన ముద్ర స్పష్టంగా కనిపిస్తాయని అన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉందని కొనియాడారు. 82వ జన్మదినం జరుపుకుంటున్న వనమా వెంకటేశ్వరరావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, మరింతకాలం ప్రజలకు సేవలందించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు కంచర్ల చంద్రశేఖర్ రావు తెలిపారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest