మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావుకు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ కాపు సీతామహాలక్ష్మి
కొత్తగూడెం (తెలంగాణ వాణి) మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు తన రాజకీయ గురువని, నియోజకవర్గ ప్రజల గుండెల్లో నిలిచిన గొప్ప ప్రజా నాయకుడని కొత్తగూడెం మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ కాపు సీతామహాలక్ష్మి (సీతాలక్ష్మి) అన్నారు. వనమా 82వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆమె హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన తరపున, తన కుటుంబ సభ్యుల తరపున, బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల తరపున వనమాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయనకు 82 ఏళ్లు వచ్చాయంటే నమ్మలేకపోతున్నానని, ఇప్పటికీ ఎంతో ఉత్సాహంగా, చురుగ్గా పనిచేస్తూ అందరినీ పేరుపేరునా పలకరిస్తున్న ఆయనను చూస్తుంటే 28 ఏళ్ల యువకుడిలా కనిపిస్తారని వ్యాఖ్యానించారు. వనమా కేవలం ఒక వర్గానికే పరిమితమైన నాయకుడు కాదని, అన్ని వర్గాల ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజలందరి అభిమానాన్ని పొందిన నాయకుడని కొనియాడారు. వనమా వెంకటేశ్వరరావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ప్రజలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిగా నిలవాలని కాపు సీతామహాలక్ష్మి ఆకాంక్షించారు.





