కొత్తగూడెం (తెలంగాణ వాణి) కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావును పలువురు సీనియర్ నాయకులు కలిసి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బిక్కసాని నాగేశ్వరరావు, కార్పొరేటర్ కంభంపాటి దుర్గాప్రసాద్, ఎం.ఏ. రాజాక్, కాసుల వెంకట్, కోత్వాల సత్యనారాయణ, కోనేరు నాగేశ్వరరావు, కృష్ణమోహన్, మాజీ కౌన్సిలర్ శ్రీరాములు తదితరులు వనమా వెంకటేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు అందజేశారు. ఆయనకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు.





