శంకరపట్నం (తెలంగాణ వాణి) కరీంనగర్ జిల్లా, శంకరపట్నం మండల కేంద్రం కేశవపట్నం గ్రామ ప్రధాన రహదారిలో అంబేద్కర్ విగ్రహం వైన్ షాపుల మధ్యన రెండు బైకులు ఢీకొని ఇద్దరు తీవ్రంగా గాయపడిన రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన యువకుడు బొజ్జ అనిల్, ఉపాధి కోసం కేశవపట్నం గ్రామానికి ఉపాధి కోసం మేస్త్రిగా వచ్చిన శ్రీను లు తీవ్ర రక్తస్రావంతో గాయాల పాలయ్యారు. వీరిలో శ్రీనుని వైద్యం కోసం ప్రైవేట్ కారులో వైద్యం కోసం తరలించగా, బొజ్జ అనిల్ ని ఓ ఆటోలో తరలించారు. ప్రమాద ఘటనలో రెండు బైకులు తుక్కు తుక్కై, ఘటన స్థలంలో తీవ్ర రక్తస్రావపు మరకలు ఉన్నాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు నమోదు చేసుకున్నారు. ఊపట్ల శ్రీనివాస్ విషమ పరిస్థితిలో ఉండగా ప్రైవేటు కారులో వైద్యం కోసం తరలించారు. ఈ ఘటనలో ఘటనా స్థలంలో రక్తం గడ్డకట్టి మెదడు బయటపడిన దృశ్యాలు చూపరులను గగరు పొడుస్తున్నాయి.




