UPDATES  

NEWS

ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షునిగా నందయ్య కొంప ముంచిన ఎంపీ కావాలన్న కోరిక! సింగరేణి అధికారులకు క్వార్టర్స్‌ కౌన్సెలింగ్ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎల్ ఎఫ్ ఎల్ హెచ్ ఎం మోహన్‌లాల్ కు సన్మానం కూచిపూడి నృత్యంతో అబ్బురపరిచిన పిడమర్తి ఋత్విక వినాయక నవరాత్రుల్లో అలరించిన మహిళల కోలాటం విశ్వకర్మలకు ప్రభుత్వం అండగా ఉంటుంది : మంత్రి అడ్లూరి మాజీ మంత్రి వనమాను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సింగరేణి ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి: ఏనుగుల రాకేష్‌రెడ్డి 679లో కొప్పులకు భూమి లేదని గుండెల మీద చేయి వేసుకొని చెప్పగలరా -రూప్ల

 రాష్ట్ర స్థాయి కబడ్డీ విజేతగా భద్రాద్రి జిల్లా బాలికల జట్టు

క్రీడాకారులను అభినందించిన కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు చీకటి కార్తీక్ 

వికారాబాద్‌ జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన 34వ సబ్‌ జూనియర్‌ అంతర్రాష్ట్ర బాలబాలికల కబడ్డీ చాంపియన్‌ షిప్‌ పోటీల్లో భాగంగా ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జట్టు సత్తా చాటింది. కాగా బాలికల జట్టును భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ చీకటి కార్తీక్ అభినందించారు. వారికి మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా చీకటి కార్తీక్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి జిల్లాలోని క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి రాష్ట్ర స్థాయిలో సత్తా చాటేలా చేసేందుకు కృషి చేస్తున్నామని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహాయంతో జిల్లాలోని కబడ్డీ క్రీడాకారులకు సింథటిక్ మ్యాట్ తో కూడిన కబడ్డీ ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తే స్పోర్ట్స్ కోటాలో భవిష్యత్ లో మంచి హోదాతో కూడిన ఉద్యోగాలు పొందే అవకాశం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, జాతీయ స్థాయిలో రాణించి భద్రాద్రి జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కబడ్డీ అసోసియేషన్‌ జాయింట్ సెక్రటరీ – భద్రాద్రి జిల్లా సెక్రటరీ కె స్వాతిముత్యం, ట్రెజరర్ నరేష్, కోచ్ సిహెచ్ రాంబాబు, వెంకట్, యూత్ కాంగ్రెస్ నాయకులు గులాం మతిన్, కుంచం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 24 February 2025, 4:51 pm Posted by : TELANGANA VANI

రాష్ట్ర స్థాయి కబడ్డీ విజేతగా భద్రాద్రి జిల్లా బాలికల జట్టు

క్రీడాకారులను అభినందించిన కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు చీకటి కార్తీక్ 
వికారాబాద్‌ జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన 34వ సబ్‌ జూనియర్‌ అంతర్రాష్ట్ర బాలబాలికల కబడ్డీ చాంపియన్‌ షిప్‌ పోటీల్లో భాగంగా ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జట్టు సత్తా చాటింది. కాగా బాలికల జట్టును భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ చీకటి కార్తీక్ అభినందించారు. వారికి మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా చీకటి కార్తీక్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి జిల్లాలోని క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి రాష్ట్ర స్థాయిలో సత్తా చాటేలా చేసేందుకు కృషి చేస్తున్నామని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహాయంతో జిల్లాలోని కబడ్డీ క్రీడాకారులకు సింథటిక్ మ్యాట్ తో కూడిన కబడ్డీ ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తే స్పోర్ట్స్ కోటాలో భవిష్యత్ లో మంచి హోదాతో కూడిన ఉద్యోగాలు పొందే అవకాశం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, జాతీయ స్థాయిలో రాణించి భద్రాద్రి జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కబడ్డీ అసోసియేషన్‌ జాయింట్ సెక్రటరీ - భద్రాద్రి జిల్లా సెక్రటరీ కె స్వాతిముత్యం, ట్రెజరర్ నరేష్, కోచ్ సిహెచ్ రాంబాబు, వెంకట్, యూత్ కాంగ్రెస్ నాయకులు గులాం మతిన్, కుంచం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest