UPDATES  

 సింగరేణి అధికారులకు క్వార్టర్స్‌ కౌన్సెలింగ్

ఇల్లందు, సెప్టెంబర్‌ 17 (తెలంగాణ వాణి): ఏరియా జీఎం వి. కృష్ణయ్య ఆదేశాల మేరకు గురువారం ఎస్‌వోటుజీఎం కార్యాలయంలో సింగరేణి అధికారులకు ఏఎంబీ, ఏ, బీ టైప్‌ క్వార్టర్స్‌ కేటాయింపునకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఫ్రెష్‌ అలాట్‌మెంట్‌, క్వార్టర్‌ మార్పు కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన అధికారులకు నిబంధనల ప్రకారం క్వార్టర్లు కేటాయించారు. ఈ సందర్భంగా యాక్టింగ్‌ ఎస్‌వోటుజీఎం రామదాస్‌ మాట్లాడుతూ, కౌన్సెలింగ్‌కు హాజరైన అర్హులైన అధికారులకు క్వార్టర్‌ కేటాయింపు ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు. క్వార్టర్‌ అలాట్‌మెంట్‌ కమిటీ ఎలాంటి సిఫార్సులకు తావులేకుండా పూర్తి పారదర్శకంగా, నిబంధనల ప్రకారం క్వార్టర్లను కేటాయిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీజీఎం (పర్సనల్‌) అజ్మీర తుకారాం, డీజీఎం (ఈఅండ్‌ఎం) లక్ష్మణమూర్తి, ఏరియా సర్వే అధికారి రామమూర్తి, సీనియర్‌ పర్సనల్‌ జి. సుధాకర్‌, జూనియర్‌ అసిస్టెంట్లు జి. వీరన్న, రాజశేఖర్‌తో పాటు పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 18 September 2026, 8:03 am Posted by : TELANGANA VANI

సింగరేణి అధికారులకు క్వార్టర్స్‌ కౌన్సెలింగ్

ఇల్లందు, సెప్టెంబర్‌ 17 (తెలంగాణ వాణి): ఏరియా జీఎం వి. కృష్ణయ్య ఆదేశాల మేరకు గురువారం ఎస్‌వోటుజీఎం కార్యాలయంలో సింగరేణి అధికారులకు ఏఎంబీ, ఏ, బీ టైప్‌ క్వార్టర్స్‌ కేటాయింపునకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఫ్రెష్‌ అలాట్‌మెంట్‌, క్వార్టర్‌ మార్పు కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన అధికారులకు నిబంధనల ప్రకారం క్వార్టర్లు కేటాయించారు. ఈ సందర్భంగా యాక్టింగ్‌ ఎస్‌వోటుజీఎం రామదాస్‌ మాట్లాడుతూ, కౌన్సెలింగ్‌కు హాజరైన అర్హులైన అధికారులకు క్వార్టర్‌ కేటాయింపు ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు. క్వార్టర్‌ అలాట్‌మెంట్‌ కమిటీ ఎలాంటి సిఫార్సులకు తావులేకుండా పూర్తి పారదర్శకంగా, నిబంధనల ప్రకారం క్వార్టర్లను కేటాయిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీజీఎం (పర్సనల్‌) అజ్మీర తుకారాం, డీజీఎం (ఈఅండ్‌ఎం) లక్ష్మణమూర్తి, ఏరియా సర్వే అధికారి రామమూర్తి, సీనియర్‌ పర్సనల్‌ జి. సుధాకర్‌, జూనియర్‌ అసిస్టెంట్లు జి. వీరన్న, రాజశేఖర్‌తో పాటు పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest