కొత్తగూడెం, సెప్టెంబర్ 17 (తెలంగాణ వాణి): మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును మాజీ ప్రభుత్వ విప్, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వనమా వెంకటేశ్వరరావు రేగా కాంతారావు తో ఆత్మీయంగా మాట్లాడారు. రేగా పై అక్రమ కేసులు పెట్టినప్పటికి అవన్నీ తప్పుడు ఆరోపణలుగా తేలడం భగవంతుడి దయ అని ఉజ్వల రాజకీయ భవిష్యత్ ఉన్న వారిపై ఇలాంటి కుట్రలు జరుగుతాయని వాటిని ధైర్యంగా ఎదురుకోవాలని వనమా అన్నారు. రాబోయే రోజుల్లో జిల్లాలో పార్టీని పటిష్ట పరిచేందుకు సుధీర్గ రాజకీయ అనుభవం ఉన్న వనమా ఆశీస్సులు, ఆలోచన విధానం ఎంతో అవసరమని రేగా అన్నారు. కొంతసేపు జరిగిన ఈ భేటీలో జిల్లాకు సంబంధించిన రాజకీయ, ప్రజా సమస్యలతో పాటు, పలు రాజకీయ పరిణామాలపై చర్చ జరిగినట్లు సమాచారం.




