UPDATES  

 ఎస్‌జీఎఫ్ క్రీడల్లో శ్రీనిధి గ్లోబల్ స్కూల్ విద్యార్థుల ఘన విజయం

శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 21 (తెలంగాణ వాణి విలేకరి) శేరిలింగంపల్లి జోన్ స్థాయి ఎస్‌జీఎఫ్ క్రీడా పోటీల్లో శ్రీనిధి గ్లోబల్ స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి పాఠశాలకు కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చారు. క్రీడలపై ఆసక్తి, కఠోర శ్రమ, క్రమశిక్షణతో పోటీల్లో పాల్గొని సత్తా చాటారు. వాలీబాల్ అండర్‌–17 బాలుర విభాగంలో ప్రథమ స్థానం సాధించి విజేతలుగా నిలిచారు. అదేవిధంగా వాలీబాల్ అండర్‌–14 బాలికల విభాగంలో ద్వితీయ స్థానం, డిస్కస్‌ త్రోలో ద్వితీయ స్థానం, ట్రిపుల్‌ జంప్‌లో ద్వితీయ స్థానం సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన 17 మంది విద్యార్థులు జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్ క్రీడా పోటీలకు ఎంపిక కావడం పాఠశాలకు మరింత గర్వకారణంగా నిలిచింది. జిల్లా స్థాయిలోనూ అత్యుత్తమ ప్రదర్శన చేసి మరిన్ని విజయాలు సాధించేందుకు విద్యార్థులు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా విజేత విద్యార్థులను పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది. వారి క్రీడా ప్రతిభ, పట్టుదల, నిరంతర సాధనను ప్రశంసిస్తూ, పోటీల్లో సాధించిన విజయాలు ఇతర విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొంది. విద్యార్థులకు నిరంతరం శిక్షణ అందించి, వారి ప్రతిభను వెలికితీసేందుకు కృషి చేసిన పీఈటీని కూడా యాజమాన్యం అభినందించింది. విజేత విద్యార్థులను శ్రీనిధి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ నల్లపాటి వెంకటేశ్వరరావు, ప్రెసిడెంట్ నల్లపాటి రాజేశ్వరి, ప్రిన్సిపాల్ శ్రావంతి అభినందించారు. జిల్లా స్థాయి పోటీల్లోనూ ఇదే ఉత్సాహంతో రాణించి పాఠశాలకు మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 22 September 2026, 8:32 am Posted by : TELANGANA VANI

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest