UPDATES  

NEWS

సరైన రోడ్డు సౌకర్యం లేకా వర్ష కాలం వస్తే రైతులకు కష్టాలే… ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి: గిరిజన సంక్షేమ సంఘం నాయకులు రాంబాబు,ఎంపీ నాయక్ ఉపాధి హామీ కూలీల ప్రాణం తీసుకున్న అతివేగం లక్ష్మీదేవి పల్లి మండలంలో వడదెబ్బకు వ్యవసాయ కూలీ మహిళా మృతి మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి లొంగుబాటు గిరిజనాభివృద్ధి పనులు నాణ్యతతో సకాలంలో పూర్తి చేస్తాం : ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుకర్ 10 లక్షలు లంచం డిమాండ్ చేసిన అటవీశాఖ అధికారులు కరీంనగర్‌లో ఉద్రిక్తత కస్టమర్ల ముసుగులో వచ్చి కాల్పులు.. షోరూమ్‌లో దోపిడీ మే 4న మెగా జాబ్ మేళాకు ఆన్లైన్‌లో నమోదు చేసుకోవాలి : కలెక్టర్ అంకిత్

 నా ఇల్లు అక్రమమైతే మీరే కూల్చేయండి

కేటీఆర్‌కు పొంగులేటి సవాల్

హైదరాబాద్ (తెలంగాణ వాణి)

హిమాయత్ సాగర్ బఫర్ జోన్‌లో తన ఇల్లు ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించడంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ మండిపడ్డారు. హైదరాబాద్‌లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. తన ఇల్లు ఇంచు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నా టేప్ పెట్టి కొలిచి కూలగొట్టాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ని కోరారు. దమ్ముంటే కేటీఆర్, హరీశ్ రావు తన ఇల్లు FTL, బఫర్ జోన్‌లో ఉందని నిరూపించాలని ఛాలెంజ్ విసిరారు.

నా ఇల్లు హిమాయత్ సాగర్ బఫర్ జోన్‌లో ఉందని కేటీఆర్ తొత్తులు అంటున్నారు. బీఆర్ఎస్‌తోపాటు ఆ పార్టీ మాజీ నేతలు నాపై బురద జల్లాలని చూస్తున్నారు. సామాన్యులకు ఇబ్బందులు ఎదురుకావొద్దని సీఎం రేవంత్ హైడ్రా ఏర్పాటు చేశారు. బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలను బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోలేదు. హైడ్రా ద్వారా ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాలనేదే మా ఉద్దేశం. ప్రభుత్వ చర్యలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

హైడ్రాను మంచి ఉద్దేశంతోనే తెచ్చాం.

ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌ పరిధిలోని నిర్మాణాలకు అనుమతించట్లేదు. నిబంధనలు అతిక్రమించిన కట్టడాలనే కూల్చివేస్తున్నాం. అవన్నీ బీఆర్ఎస్ హయాంలో జరిగిన నిర్మాణాలు. నా ఇల్లు అక్రమంగా ఉంటే.. వెంటనే కూల్చివేయాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను ఆదేశిస్తున్నా. అధికారులకు బదులు బీఆర్ఎస్ నేతలే వెళ్లి కొలతలు తీయండి. అక్రమ కట్టడం అని తేలితే.. కూల్చేయండి” అని పొంగులేటి.. కేటీఆర్‌కు సవాల్ విసిరారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest