UPDATES  

NEWS

కవితక్క కొత్త పార్టీ పేరు TRS జనాభా గణన 2027 శిక్షణ కార్యక్రమం ప్రారంభం – పాల్వంచలో 36 మందికి ట్రైనింగ్ ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం… వేములవాడలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సాంకేతిక విజ్ఞానానికి వారధి… హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్! కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి హ్యాండ్ బోర్ మరమ్మతు – ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారం:కార్పొరేటర్ కళావతిధనరాజ్ కాంగ్రెస్ నాయకులకు కాకులమర్రి లక్ష్మణ్ బాబు భయం పట్టుకుంది అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్  సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్,

 కవితతో ములాఖత్ కానున్న కేటీఆర్, హరీష్

న్యూఢిల్లీ (తెలంగాణ వాణి కరస్పాండెంట్)

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌ అయి గత కొన్ని నెలలుగా తీహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. బెయిల్ కోసం విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ ప్రతీసారి కవితకు నిరాశానే ఎదురవుతోంది. మరోవైపు జైలులో ఉన్న కవిత బరువు తగ్గారని వార్తలు వినిపించాయి. అయితే నిన్న కవిత జైలులో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆమెను జైలు అధికారులు ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. ఆరోగ్యం నిలకడ అయిన తర్వాత తిరిగి కవితను తీహార్‌ జైలుకు తరలించారు అధికారులు. జైలులో కవిత అనారోగ్యం బారిన పడటం ఇదిరెండో సారి. కాగా.. జైలులో ఉన్న కవితతో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావులు మరి కొద్దిసేపట్లో ములాఖత్ కానున్నారు. కవిత అనారోగ్యం గురించి తెలిసిన వెంటనే మాజీ మంత్రులు కవితను కలిసేందుకు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. కాగా.. నిన్న జైలులో అస్వస్థతకు గురైన కవితకు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించారు. కవిత గైనిక్ సమస్యలు, వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. జైలు డాక్టర్ల సిఫారసు మేరకు వైద్య పరీక్షల నిమిత్తం కవితను ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. గతంలో కూడా కవిత అస్వస్థతకు గురయ్యారు. ఆ సమయంలోనూ ఆమెను ఎయిమ్స్‌కి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మార్చి 15వ తేదీన ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత సీబీఐ సైతం ఆమెను కస్టడీలోకి తీసుకుంది. ఈ రెండు దర్యాప్తు సంస్థల కేసుల్లో కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నారు. బెయిల్ కోసం ఇప్పటికే అనేకసార్లు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం ఆమె బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసులో సీబీఐ కౌంటర్ దాఖలు చేసినా.. ఈడీ ఇంకా కౌంటర్ దాఖలు చేయలేదు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest