ధర్మారం (తెలంగాణ వాణి) పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఫిజిక్స్ బోధించేందుకు మహిళా అభ్యర్థులను ఆహ్వానిస్తున్నట్లు స్థానిక ప్రిన్సిపల్ జి విజయ ఒక ప్రకటనలో తెలిపారు. ఫిజిక్స్ పోస్టు ఖాళీల సంఖ్య 1 అర్హత ఎంఎస్సీ ఫిజిక్స్, బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలని కోరారు. మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని ఆసక్తి గల అభ్యర్థులు తమ ఒరిజినల్ ధ్రువపత్రాలతో ఈ నెల 24 గురువారం ఉదయం 10 గంటలకు నంది మేడారంలోని కళాశాల ప్రాంగణంలో హాజరుకావాలని ప్రిన్సిపల్ విజయ కోరారు.




