UPDATES  

NEWS

జనగామ జిల్లా కలెక్టర్ తీరుపై జర్నలిస్ట్ నాయకుల ఫిర్యాదు పచ్చని ఔషధ మొక్కలు అందజేసి ఆశీర్వాదం పొందిన చిన్నారి అఫాన్ జైదీ సర్పంచ్ జర్పల దేవి ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం రోడ్డెక్కిన అన్నదాతలు వైన్స్ సిట్టింగ్ రూమ్ లో వ్యక్తి మృతి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం… సరైన రోడ్డు సౌకర్యం లేకా వర్ష కాలం వస్తే రైతులకు కష్టాలే… ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి: గిరిజన సంక్షేమ సంఘం నాయకులు రాంబాబు,ఎంపీ నాయక్ ఉపాధి హామీ కూలీల ప్రాణం తీసుకున్న అతివేగం లక్ష్మీదేవి పల్లి మండలంలో వడదెబ్బకు వ్యవసాయ కూలీ మహిళా మృతి

 జాతీయ వృద్ధుల దినోత్సవంగా సేవా కార్యక్రమాలు

ఖమ్మం (తెలాంగాణ వాణి ప్రతినిధి హనీఫ్) మేరా యువ భారత్ సహకారంతో పువ్వాడ నగర్ జాగృతి యూత్ అసోసియేషన్ ఖమ్మం, ఆధ్వర్యంలో జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా వృద్ధాశ్రమంలో గల వృద్ధులకు పండ్లు పంపిణీ చేయాలని ఉదేశ్యంతో 3 రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని పాండురంగాపురంలో గల జీసెస్ అనాధ వృద్ధాశ్రమం, పుట్టపర్తి సాయిబాబా అనాధ వృద్ధాశ్రమాలలో అభాగ్యులైన వృద్ధ మహిళలకు పండ్లు పంచడం జరిగింది. మానవ హక్కుల పరిరక్షణ సంస్థ (హెచ్ఆర్, సిసిఐ) ఖమ్మం జిల్లా కమిటీ సభ్యులు కూడా పాల్గొని వృద్ధులకు సహాయ సహకారాలు అందించి పండ్లు పంచడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జాగృతి యూత్ అసోసియేషన్, ఖమ్మం జిల్లా నిర్వాహకులు సయ్యద్ షారుక్ ఇమ్రాన్ మాట్లాడుతు జాగృతి యూత్ అసోసియేషన్, ఖమ్మం జిల్లా సభ్యుడిగా ఖమ్మంలో అనేక సేవా కార్యక్రమాలు చేశానని అనాధలకు, అభాగ్యులకు, పేదవారికి, అనునిత్యం తన వంతు సాయంగా ఏదో ఒక రూపంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నానని, ఇలాంటి ఆశ్రమంలో గతంలో కూడా పలుమార్లు వచ్చి పండ్లు పంపిణీ చేశానని, అబాగ్యులకు అన్నపానీయాలే కాక దుప్పట్లు పంపిణీ చేశానని, కరోనా కాలంలో ఖమ్మంలోని పలు కాలనీలకు వెళ్లి ప్రతిరోజు భోజనాలు, మాస్కులు అందించామని, వరదల కారణంగా ఖమ్మం పరిసర ప్రాంతాలలో మునిగిపోయిన గృహాలను సందర్శించి వారికి కట్టుబట్టలు కూడా ఇచ్చామని అన్నారు. అంతేకాక ఇక ముందు కూడా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు నా వంతు బాధ్యతగా చేస్తానని అన్నారు. ఆశ్రమంలోని వృద్దులు యువకులను దీవించి మంచి మనసు ఉన్న మీరు దినదిన అభివృద్ధి చెందుతూ మీ వృత్తి లో గొప్ప గొప్ప పదవులను పొందుతూ తమలాంటి ఎంతోమంది అభాగ్యులకు ఇలాంటి సహాయ సహకారాలు అందిస్తూ నిండు నూరేళ్లు జీవించాలని ఆశీర్వదించారు, ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ కమిటీ సభ్యులు సంకా గణేష్, చింతల రవి, నీరుడు రాంబాబు, తదితరులు ఉన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest