ఇంజమూరి సత్యనారాయణ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

డిండి సెప్టెంబర్ 14( తెలంగాణ వాణి ప్రతినిధి) డిండి మండలంలోని నిజాం నగర్ గ్రామపంచాయతీకి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇంజమూరి కృష్ణయ్య పెద్ద కుమారుడు ఇంజమూరి సత్యనారాయణ అకాల మరణం చెందడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థికంగా అండగా నిలిచారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లట్టుపల్లి పురుషోత్తం రెడ్డి 10,000/- పదివేల రూపాయలు, నల్లవెల్లి దామోదర్ రెడ్డి 5,000/- ఐదు వేల రూపాయలు అలాగే నిజాం నగర్ గ్రామపంచాయతీకి చెందిన […]
సమాచార హక్కు ప్రచార సమితి నియోజకవర్గ కార్యదర్శిగా మాదాసు సురేష్

డిండి సెప్టెంబర్ 14 ( తెలంగాణ వాణి ప్రతినిధి) గుండ్లపల్లి (డిండి) మండలంలోని నిజాం నగర్ గ్రామానికి చెందిన మాదాసు సురేష్ సమాచార హక్కు ప్రచార సమితి దేవరకొండ నియోజకవర్గ కార్యదర్శిగా నూతనంగా ఎన్నిక కావడం జరిగింది. ఎన్నికకు సహకరించిన సమాచార హక్కు ప్రచార సమితి రాష్ట్ర అధ్యక్షులు కాట్రావత్ రాజుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజం నగర్ గ్రామ యువకులు పాల్గొనడం జరిగింది.
కుట్టుమిషన్ల శిక్షణ పూర్తి చేసిన 40 మంది మహిళలు

సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన మేయర్ మూడ్ గణేష్ కొత్తగూడెం, సెప్టెంబర్ 14 (తెలంగాణ వాణి) రామవరం లోని 16వ డివిజన్ పరిధిలో మదర్ తెరిసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 45 రోజుల శిక్షణ శిబిరంలో శిక్షణ పొందిన 40 మహిళలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ శిక్షణ సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. సోమవారం అంబేద్కర్ చమన్లో ఏర్పాటు చేసిన సర్టిఫికెట్ల పంపిణీలో 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ అధ్యక్షతన ఏర్పాటు చేసిన […]
ఆదిదేవుడు గణేశుడి ఆశీస్సులే మనందరికీ శ్రీరామరక్ష

ఉత్సవ మండపాలను సందర్శించిన కొత్వాల పాల్వంచ, సెప్టెంబర్ 14 (తెలంగాణ వాణి) ఆదిదేవుడు గణేశుడి ఆశీస్సులే ప్రజలందరికీ శ్రీరామ రక్ష అని, వినాయకుని ఆశీర్వాదం సకల జనులకు ఉండాలని రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్, పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాల్వంచలో వినాయక చవితి సందర్భంగా సోమవారం పూజలు ఘనంగా నిర్వహించారు. పాల్వంచలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణపతి నవరాత్రి ఉత్సవాల మండపాలను కొత్వాల సందర్శించారు.ఈ కార్యక్రమంలో మాజీ […]
కొత్తగూడెంలో ఉచిత వినాయక విగ్రహాలు పంపిణి చేసిన కాంగ్రెస్ నాయకులు

కొత్తగూడెం, సెప్టెంబర్ 14 (తెలంగాణ వాణి): వినాయక చవితిని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో పర్యావరణ పరిరక్షణ, మత సామరస్యాన్ని చాటుతూ ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ ముస్లిం మైనారిటీ నాయకుల చేతుల మీదుగా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఆళ్ల మురళి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆళ్ల మురళి మాట్లాడుతూ మట్టి వినాయక విగ్రహాల వినియోగంతో పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటంతో పాటు మత […]
వీకే సీఎం పిఓ శంకర్ ను కలిసిన ఐఎన్టియుసి నేత రజాక్

కొత్తగూడెం సింగరేణి, సెప్టెంబర్ 14 (తెలంగాణ వాణి) వికె సీఎం ప్రాజెక్టు ఆఫీసర్ జి. శంకర్ ను ఐఎన్టీయూసీ కేజీఎం ఏరియా వైస్ ప్రెసిడెంట్ రాజాక్ మర్యాద మర్యాదపూర్వకంగా సోమవారం కలిశారు. వికె సీఎం పిట్ సెక్రటరీ గోపు కుమార స్వామి అధ్యక్షతన కేజీమ్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండీ.రజాక్ పలు అంశాలపై చర్చించారు. ప్రొడక్షన్,ప్రొడక్టివిటీ, మ్యాన్పవర్,డిప్యూటేషన్ ఉద్యోగులు, సూపర్వైజర్ క్యాడర్, వికెసీఎం అంశాల మీద మాట్లాడటం జరిగినది. దీంతో పిఓ సానుకూలంగా స్పందించటం జరిగినది. ఈ […]
గణేష్ మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మేయర్ “గణేష్”

కొత్తగూడెం, సెప్టెంబర్ 14 (తెలంగాణ వాణి) కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని రామవరం 7 బజార్ నందు రెడ్డి బ్రదర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి వినాయక మండపం లో పాల్గొన్న మేయర్ మూడ్ గణేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండప నిర్వహకులు, పూజారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ మర్యాదలతో పూజలు చేయించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, కార్పొరేషన్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
గోపిశెట్టి శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించిన “కోనేరు చిన్ని”

కొత్తగూడెం, సెప్టెంబర్ 14 (తెలంగాణ వాణి) కోనేరు చిన్ని ముఖ్య అనుచరుడు మాజీ కౌన్సిలర్ గోపిశెట్టి శ్రీనివాస్ సతీమణి ఆకస్మిక మరణించగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కోనేరు సత్యనారాయణ ( చిన్ని) సోమవారం ఆమె భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో 15వ డివిజన్ కార్పొరేటర్ ఆకునూరి సుప్రియ, ఐ.యన్.టి.యూ.సి వైస్ ప్రెసిడెంట్ రజాక్, వివిధ పార్టీల నాయకులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు

కొత్తగూడెం, సెప్టెంబర్ 14 (తెలంగాణ వాణి): కొత్తగూడెం పట్టణంలోని శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానంలో వినాయక చవితి సందర్భంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు మంగళవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక విఘ్నేశ్వర పూజలో కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు పాల్గొని స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. భక్తులకు విజయాలను ప్రసాదించే విఘ్నేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందిన స్వామివారికి ఉత్సవాల సందర్భంగా ప్రతి రోజూ ప్రత్యేక అలంకరణలు చేయనున్నారు. నవరాత్రి ఉత్సవాలు ఈ […]