ధర్మారం, సెప్టెంబర్ 29 (తెలంగాణ వాణి): ధర్మారం, ఎండపల్లి, వెల్గటూర్ మండలాలకు చెందిన మార్బల్, టైల్స్ ఫిట్టింగ్ కార్మికులు మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మక్రాన గ్రానైట్ మార్బల్, టైల్స్ ఫిట్టింగ్ వర్కర్స్ అసోసియేషన్ పేరుతో నూతన సంఘాన్ని ఏర్పాటు చేసి కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బానోతు శివ (బంజేరుపల్లి), ఉపాధ్యక్షుడిగా గాజన వేణి సాగర్ (పాతగూడూర్), ప్రధాన కార్యదర్శిగా కాంపెల్లి మహేందర్ (గుల్లకోట), సంయుక్త కార్యదర్శిగా పుప్పాల ఆంజనేయులు (నర్సింగాపూర్), కోశాధికారిగా తనుగుల రాజశేఖర్ (అంబారిపేట), కార్యవర్గ సభ్యుడిగా కమ్మం వెంకటేశ్ (పాతగూడూర్) ఎన్నికయ్యారు. మూడు మండలాల్లోని మార్బల్, టైల్స్ ఫిట్టింగ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి చేస్తామని నూతన కార్యవర్గ సభ్యులు తెలిపారు. అనంతరం సంఘ సభ్యులు నూతన కార్యవర్గాన్ని శాలువాలతో సన్మానించారు.



