సెప్టెంబర్ 30న ఉమ్మడి ఖమ్మం జిల్లా రెజ్లింగ్ ఎంపికలు:జిల్లా SGF కార్యదర్శి భూక్యా భావ్‌సింగ్
ఉమ్మడి ఖమ్మం జిల్లా అండర్–14, అండర్–17 బాలబాలికల రెజ్లింగ్ జట్ల ఎంపికలు సెప్టెంబర్ 30న భద్రాద్రి కొత్తగూడెం CER క్లబ్‌లో నిర్వహించనున్నట్లు జిల్లా SGF కార్యదర్శి భూక్యా భావ్‌సింగ్ తెలిపారు.ఉదయం 9 గంటలకు క్రీడాకారులు రిపోర్ట్ చేయాలని సూచించారు. అండర్–14 విభాగంలో 01.01.2013 తర్వాత, అండర్–17 విభాగంలో 01.01.2010 తర్వాత జన్మించిన విద్యార్థులు అర్హులని తెలిపారు. క్రీడాకారులు ఒరిజినల్ స్టడీ సర్టిఫికెట్, SGF ఎలిజిబిలిటీ ఫామ్, ఆధార్ జిరాక్స్, జనన ధ్రువపత్రం, బోనఫైడ్ సర్టిఫికెట్ తదితర పత్రాలతో […]
మార్బల్, టైల్స్ ఫిట్టింగ్ వర్కర్స్ సంఘం నూతన కార్యవర్గం

ధర్మారం, సెప్టెంబర్ 29 (తెలంగాణ వాణి): ధర్మారం, ఎండపల్లి, వెల్గటూర్ మండలాలకు చెందిన మార్బల్, టైల్స్ ఫిట్టింగ్ కార్మికులు మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మక్రాన గ్రానైట్ మార్బల్, టైల్స్ ఫిట్టింగ్ వర్కర్స్ అసోసియేషన్ పేరుతో నూతన సంఘాన్ని ఏర్పాటు చేసి కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బానోతు శివ (బంజేరుపల్లి), ఉపాధ్యక్షుడిగా గాజన వేణి సాగర్ (పాతగూడూర్), ప్రధాన కార్యదర్శిగా కాంపెల్లి మహేందర్ (గుల్లకోట), సంయుక్త కార్యదర్శిగా పుప్పాల ఆంజనేయులు (నర్సింగాపూర్), కోశాధికారిగా […]