యూట్యూబ్ వీడియోస్ పేరిట ప్రజలకు కుచ్చు టోపీ పెట్టిన మరో సంస్థ

కోట్లు నొక్కేసి కుంటి సాకులు చెబుతున్నారంటు బాధితుల ఆవేదన ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసిన ఆన్లైన్ మోసాలు తరచూ వెలుగుచూస్తున్నాయి. అక్షర జ్ఞానం లేని వారి నుంచి ఉన్నత విద్యాభ్యాసం చేసిన, ఉద్యోగులు.. ఆన్లైన్ మోసాల్లో చిక్కుకుంటున్నారు. నిరుద్యోగులు, యువతే టార్గెట్ గా కొందరు కేటుగాళ్లు వల వేస్తున్నారు. ఖాళీ సమయంలో పార్ట్ టైంగా ఇంటి వద్దే ఉండి ఉద్యోగం చేయండి, భారీగా సంపాదించే అవకాశం ఉంది అంటూ మాయగాళ్లు పెద్ద ఎత్తున యువత నుంచి […]
ఢిల్లీకి గులాంగిరి చేయడం కోసమే రాజీవ్ విగ్రహ ఏర్పాటు : కొట్టి వెంకటేశ్వరరావు

తెలంగాణ రాష్ట్ర సచివాలయం, తెలంగాణ అమర జ్యోతి మధ్యలో ఉండాల్సిన తెలంగాణ తల్లి విగ్రహాం స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టటం తెలంగాణ తల్లిని అవమానించడమేనని బిఆర్ఎస్ పార్టీ లక్ష్మిదేవిపల్లి మండల అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వరరావు అన్నారు. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కకాంతారావు సూచనలతో రేవంత్ ప్రభుత్వం తీరుకు నిరసనగా పార్టీ లక్ష్మిదేవిపల్లి మండల అధ్యక్షులు కొట్టి […]
హరీష్ రావు బృందాన్ని విడుదల చేసిన కేశంపేట పోలీసులు

హైదరాబాద్ (తెలంగాణ వాణి బ్యూరో) గత మూడు గంటలుగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం కేంద్రంలో మాజీ మంత్రి హరీష్ రావు గంగుల కమలాకర్ వేముల ప్రశాంత్ రెడ్డి తదితరుల అరెస్టు సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్ ముందు జరుగుతున్న ఆందోళన ఎట్టకేలకు ముగిసింది. మంత్రి హరీష్ రావు తదితర బృందాన్ని కెశంపేట పోలీసులు రాత్రి 11 గంటల తర్వాత వదిలేశారు. దీంతో హరీష్ రావు తదితరులు తమ వాహనాల్లో వెళ్లిపోయారు. ఈ […]
ఎన్ఆర్ఎస్ కళాశాల గణేష్ నిమజ్జనం ఉత్సవాలు

కోదాడ (తెలంగాణ వాణి ప్రతినిది) కోదాడ పట్టణంలోని ఎన్ఆర్ఎస్ కళాశాలలో వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాలను ప్రతిష్టించి విద్యార్థిని విద్యార్థులు భక్తి శ్రద్ధలతో వైభవంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళాశాల బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి శోభయాత్రలో విద్యార్థిని విద్యార్థులు ఆటపాటలతో డాన్సులతో కోలాటాలాడుతూ వివిధ వేషధారణలో ప్రదర్శనలు చేస్తూ స్వామివారిని మట్టపల్లి పుణ్యక్షేత్రమైన నది వద్దకు నిమజ్జనానికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ మనోహర్ రెడ్డి, కరస్పాండెంట్ వేణుగోపాల రావు, వైస్ ప్రిన్సిపాల్ […]
ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేక మనస్థాపానికి గురై ఆత్మహత్య

హైదరాబాద్ / పటాన్ చెరువు (తెలంగాణ వాణి ప్రతినిది) గుమ్మడిదల్ మండలంలో బీహార్ నుండి బతుకు తెరువు కోసం దోమడుగు గ్రామంలో రాజ్ కుమార్ భార్య గీతాదేవి ముగ్గురు కొడుకులుతో కలిసి ఓ ప్రయివేట్ కంపెనీలో పనిచేసుకుంటూ గత రెండు సంవత్సరాల జీవనం సాగిస్తున్నారు. అయితే పెద్ద కుమారుడు అంకిత్ కుమార్ వాళ్ల సొంత గ్రామానికి చెందిన అమ్మాయిని ప్రేమించడంతో పెద్దలు నిరాకరించారు. విషయం తెలుసుకున్న అంకిత్ బీహార్ కు వెళ్లి తరచూ అమ్మాయిని కలుస్తుండడంతో , […]
ప్రతి కార్మికుడు సభ్యత్వం నమోదు చేసుకోవాలి

హుజూర్ నగర్ (తెలంగాణ వాణి ప్రతినిది) భవన నిర్మాణ కార్మికుడు మేళ్లచెరువు సతీష్ మరణం చాలా బాధాకరమైన విషయమని ఎలక సోమయ్య గౌడ్ అన్నారు. కాగ సతీష్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు వారికి పట్టణ కమిటీ సభ్యులు తరఫున భౌతిక దేహానికి పూలమాలవేసి సంతాపం తెలియజేశారు.వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. సతీష్ అందరితో కలిసిపోయే వ్యక్తిత్వం కలిగిన మనిషి అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని, […]
జగిత్యాల జైత్రయాత్రకు 46 ఏళ్లు

తెలంగాణ వాణి (స్పెషల్ కరస్పాండెంట్) తెలంగాణ విప్లవోద్యమ చరిత్రకు సంబంధించిన ప్రస్తావన వస్తే ‘జగిత్యాల జైత్రయాత్ర’ గుర్తుకు తెచ్చుకోవల్సిందే. ఈ ప్రాంతంలో విప్లవోద్యమాలకు ఆ జైత్రయాత్రే నాంది పలికింది. ఎలాంటి సమా చార వ్యవస్థలు అందుబాటులో లేని కాలంలో, కేవలం మాటల ద్వారా విషయం తెలుసుకొని లక్షలాది మంది ఒకే చోటుకు చేరిన రోజు సరిగ్గా 46 ఏళ్ల క్రితం 1978 సెప్టెంబర్ 9న రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభ చరిత్రలో […]
ఉచిత మట్టి గణపతులు పంపిణీ చేసిన ప్రముఖ వ్యాపార వేత్త

బిచ్కుంద/కామారెడ్డి (తెలంగాణ వాణి ప్రతినిధి) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో ప్రముఖ వ్యాపార వేత్త బండయప్ప పటేల్ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి గణపతులను బిచ్కుంద మఠాధిపతి శ్రీ శ్రీశ్రీ 108 సోమలింగా శివాచార్య స్వామిజీ వారి చేతుల మీదుగా పంపిణీ చేశారు. మఠాధిపతి స్వామిజీ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరిపై ఉందని మట్టి విగ్రహాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చి పంపిణీ చేసినందుకు సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో బండయప్ప పటేల్, సిద్దు […]
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి కోటి పారితోషకం, గ్రూప్-2 ఉద్యోగం

హైదరాబాద్ (తెలంగాణ వాణి కరస్పాండెంట్) పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్ లో అద్భుతం చేసిన తెలంగాణ అథ్లెట్ దీప్తి జీవాంజిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. అథ్లెట్ దీప్తి జీవాంజి పారాలింపిక్స్ లో పాల్గొని కాంస్య పతకం సాధించి సత్తా చాటింది. ఇటీవల ఒలింపిక్స్ తరువాత సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ విశ్వవేదికపై సత్తాచాటే అథ్లెట్లు, ఆటగాళ్లను కచ్చితంగా గౌరవిస్తాం, వారు మరిన్ని విజయాలు సాధించేందుకు ప్రోత్సహిస్తామన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం రేవంత్ తెలంగాణ […]
మట్టి వినాయకుడిని పూజిద్దాం

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మట్టి వినాయక ప్రతిమలను పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదామని లయన్స్ క్లబ్ ధర్మారం అధ్యక్షుడు తలమక్కి రవీందర్ శెట్టి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ధర్మారం మండల కేంద్రంలో మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు ఎల్లారెడ్డి, ఎండి ముజాహిద్, కళ్లెం స్వామి రెడ్డి, ఎలగందుల అశోక్, సిహెచ్ నర్సింగం, సిహెచ్ శేఖర్, దయానంద్, సతీష్, తదితరులు పాల్గొన్నారు.