కోదాడ (తెలంగాణ వాణి ప్రతినిది)
కోదాడ పట్టణంలోని ఎన్ఆర్ఎస్ కళాశాలలో వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాలను ప్రతిష్టించి విద్యార్థిని విద్యార్థులు భక్తి శ్రద్ధలతో వైభవంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళాశాల బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి శోభయాత్రలో విద్యార్థిని విద్యార్థులు ఆటపాటలతో డాన్సులతో కోలాటాలాడుతూ వివిధ వేషధారణలో ప్రదర్శనలు చేస్తూ స్వామివారిని మట్టపల్లి పుణ్యక్షేత్రమైన నది వద్దకు నిమజ్జనానికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ మనోహర్ రెడ్డి, కరస్పాండెంట్ వేణుగోపాల రావు, వైస్ ప్రిన్సిపాల్ జీ వి, క్యాంపస్ ఇన్చార్జులు, లెక్చరర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
Post Views: 192