తెలంగాణ రాష్ట్ర సచివాలయం, తెలంగాణ అమర జ్యోతి మధ్యలో ఉండాల్సిన తెలంగాణ తల్లి విగ్రహాం స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టటం తెలంగాణ తల్లిని అవమానించడమేనని బిఆర్ఎస్ పార్టీ లక్ష్మిదేవిపల్లి మండల అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వరరావు అన్నారు. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కకాంతారావు సూచనలతో రేవంత్ ప్రభుత్వం తీరుకు నిరసనగా పార్టీ లక్ష్మిదేవిపల్లి మండల అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి జిల్లా కార్యాలయంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు ఉద్యమనేత, మాజీ సీఎం కేసీఆర్ గత ప్రభుత్వ హయాంలో ఆ ప్రాంతాన్ని తెలంగాణ తల్లి విగ్రహానికి కేటాయించారు. కానీ రాజీవ్ విగ్రహ ఏర్పాటు తెలంగాణ అస్తిత్వాన్ని తాకట్టు పెట్టే సిగ్గుమాలిన చర్య అని అన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తెలంగాణలో ఎక్కడ ఏర్పాటు చేసిన తమకు అభ్యంతరం లేదని, మాజీ ప్రధానిగా ఆయన్ని గౌరవిస్తామని, ఢిల్లీ పెద్దల మెప్పు కోసం తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కోసం స్థలం రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తు రేవంత్ ఇలాంటి చిల్లర వేషాలు వేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సమాజం ఇలాంటి చర్యలను హర్షించదన్నారు. రాబోయే రోజుల్లో అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఖచ్చితంగా ప్రతిష్టించి తీరుతామన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వరరావుతో పాటు, మాజీ ఉర్దూఘర్ చైర్మన్ అన్వర్ పాషా, మాజీ ఆత్మ కమిటీ డైరెక్టర్ శేషాద్రి వినోద్, మండల మైనార్టీ అధ్యక్షుడు ఇక్బాల్, టీ టైప్స్ మునీర్, బద్రు, ఎస్టీ సెల్ అధ్యక్షులు లావుడియా రామకోటి, తరాల దాము, శ్రీనివాస్, హేమచంద్రపురం శ్రీకాంత్ నాయక్, పొదిలి వెంకటాచలం, ఎర్రబాడు శ్రీను, సంజయ్ నగర్ రసూల్, చిర్రా వెంకన్న, ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి తుంపిరి ప్రసాద్, అజ్మీర విజయ్, సీతారాంపురం బద్రు, బాలు, కొత్తూరు నారాయణ తదితరులు పాల్గొన్నారు.