UPDATES  

NEWS

సరైన రోడ్డు సౌకర్యం లేకా వర్ష కాలం వస్తే రైతులకు కష్టాలే… ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి: గిరిజన సంక్షేమ సంఘం నాయకులు రాంబాబు,ఎంపీ నాయక్ ఉపాధి హామీ కూలీల ప్రాణం తీసుకున్న అతివేగం లక్ష్మీదేవి పల్లి మండలంలో వడదెబ్బకు వ్యవసాయ కూలీ మహిళా మృతి మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి లొంగుబాటు గిరిజనాభివృద్ధి పనులు నాణ్యతతో సకాలంలో పూర్తి చేస్తాం : ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుకర్ 10 లక్షలు లంచం డిమాండ్ చేసిన అటవీశాఖ అధికారులు కరీంనగర్‌లో ఉద్రిక్తత కస్టమర్ల ముసుగులో వచ్చి కాల్పులు.. షోరూమ్‌లో దోపిడీ మే 4న మెగా జాబ్ మేళాకు ఆన్లైన్‌లో నమోదు చేసుకోవాలి : కలెక్టర్ అంకిత్

 పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి కోటి పారితోషకం, గ్రూప్-2 ఉద్యోగం

హైదరాబాద్ (తెలంగాణ వాణి కరస్పాండెంట్)

పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్ లో అద్భుతం చేసిన తెలంగాణ అథ్లెట్ దీప్తి జీవాంజిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. అథ్లెట్ దీప్తి జీవాంజి పారాలింపిక్స్ లో పాల్గొని కాంస్య పతకం సాధించి సత్తా చాటింది. ఇటీవల ఒలింపిక్స్ తరువాత సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ విశ్వవేదికపై సత్తాచాటే అథ్లెట్లు, ఆటగాళ్లను కచ్చితంగా గౌరవిస్తాం, వారు మరిన్ని విజయాలు సాధించేందుకు ప్రోత్సహిస్తామన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం రేవంత్ తెలంగాణ అథ్లెట్ దీప్తిని మరింత ప్రోత్సహించేందుకు గ్రూప్-2 ఉద్యోగం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆమెకు రూ.1 కోటి నగదు బహుమతి సైతం ప్రకటించారు రేవంత్. దాంతో పాటుగా వరంగల్ లో 500 గజాల స్థలం ఇస్తామన్నారు. దీప్తి జీవాంజికి శిక్షణ ఇచ్చిన ఆమె కోచ్ రమేష్ కు రూ.10లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పారాలింపిక్స్ లో పాల్గొనే వారికి మెరుగైన కోచింగ్, ఇతర ప్రోత్సాహం అందించే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. శాట్ చైర్మన్ శివసేనా రెడ్డి, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest