హైదరాబాద్ / పటాన్ చెరువు (తెలంగాణ వాణి ప్రతినిది)
గుమ్మడిదల్ మండలంలో బీహార్ నుండి బతుకు తెరువు కోసం దోమడుగు గ్రామంలో రాజ్ కుమార్ భార్య గీతాదేవి ముగ్గురు కొడుకులుతో కలిసి ఓ ప్రయివేట్ కంపెనీలో పనిచేసుకుంటూ గత రెండు సంవత్సరాల జీవనం సాగిస్తున్నారు. అయితే పెద్ద కుమారుడు అంకిత్ కుమార్ వాళ్ల సొంత గ్రామానికి చెందిన అమ్మాయిని ప్రేమించడంతో పెద్దలు నిరాకరించారు. విషయం తెలుసుకున్న అంకిత్ బీహార్ కు వెళ్లి తరచూ అమ్మాయిని కలుస్తుండడంతో , అబ్బాయిని అమ్మాయి తల్లిదండ్రులు రెడ్ హ్యాండుగా పట్టుకున్నారు. మరోసారి ఇలా జరిగితే పోలీస్ లకు ఫిర్యాదు చేస్తామని బెదిరించారు. కాగ విషయం తెలుసుకున్న అంకిత్ కుమార్ తల్లిదండ్రులు వెంటనే బీహార్ కి వెళ్లి కొడుకుకి సర్ది చెప్పి తిరిగి ఇంటికి తీసుకురావడం జరిగింది. తదననంతరం అమ్మాయి దగ్గరనుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో మనస్థాపానికి గురైన అంకిత్ కుమార్ సాయంత్రం సమయంలో ఫ్యాన్ కి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడి తల్లిదండ్రులను ఏం జరిగిందో కనుక్కొని దర్యాప్తు ప్రారంభించారు.