బిచ్కుంద/కామారెడ్డి (తెలంగాణ వాణి ప్రతినిధి)
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో ప్రముఖ వ్యాపార వేత్త బండయప్ప పటేల్ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి గణపతులను బిచ్కుంద మఠాధిపతి శ్రీ శ్రీశ్రీ 108 సోమలింగా శివాచార్య స్వామిజీ వారి చేతుల మీదుగా పంపిణీ చేశారు. మఠాధిపతి స్వామిజీ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరిపై ఉందని మట్టి విగ్రహాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చి పంపిణీ చేసినందుకు సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో బండయప్ప పటేల్, సిద్దు పటేల్, పుండలిక్ సార్, అఖిల్, అమిత్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 124