UPDATES  

NEWS

బెస్ట్ సిటిజన్ పోలీస్ అవార్డు అందుకున్న ధర్మారం ఎస్సై తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరునే కొనసాగించాలి రాష్ట్రస్థాయిలో బంగారు పతకాలు సాధించిన కొత్తగూడెం క్రీడాకారులు టీటీడీ మాజీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి మాజీ ఈవో ధర్మారెడ్డి లను అరెస్టు చేయాలి : గాయత్రి బెహరా యూట్యూబ్ వీడియోస్ పేరిట ప్రజలకు కుచ్చు టోపీ పెట్టిన మరో సంస్థ ఢిల్లీకి గులాంగిరి చేయడం కోసమే రాజీవ్ విగ్రహ ఏర్పాటు : కొట్టి వెంకటేశ్వరరావు ఢిల్లీ సీఎంగా అతిషి మట్టిమనుషులను పోరాట యోధులుగా మార్చింది “ఎర్రజెండా” నే కొత్త ఒరవడికి సీఎం నాంది ! నిమజ్జన వేడుకల్లో రేవంత్ జాతీయ జెండాకు అవమానం

 ప్రతి కార్మికుడు సభ్యత్వం నమోదు చేసుకోవాలి

హుజూర్ నగర్ (తెలంగాణ వాణి ప్రతినిది)

భవన నిర్మాణ కార్మికుడు మేళ్లచెరువు సతీష్ మరణం చాలా బాధాకరమైన విషయమని ఎలక సోమయ్య గౌడ్ అన్నారు. కాగ సతీష్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు వారికి పట్టణ కమిటీ సభ్యులు తరఫున భౌతిక దేహానికి పూలమాలవేసి సంతాపం తెలియజేశారు.వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. సతీష్ అందరితో కలిసిపోయే వ్యక్తిత్వం కలిగిన మనిషి అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని, నిర్మాణ రంగంలో పనిచేస్తున్న ఎందరో కార్మికులు కార్డు రెన్యువల్ చేయించుకోకపోవడం వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందలేకపోతున్నారని నిర్మాణ రంగంలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడు సభ్యత్వ నమోదు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డులు ప్రవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇస్తామని అనడం చాలా బాధాకరం అలాంటి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా సోమయ్య గౌడ్ తెలియజేశారు. పెండింగ్లో ఉన్న క్లెయిమ్ లు వెంటనే పరిష్కరించాలని కార్మిక నిధులను విడుదల చేయాలని రాబోయే రోజుల్లో కార్మిక సమస్యలపై పోరాటానికి కార్మికులంతా సిద్ధం కావాలని అని తెలియజేశారు. సతీష్ కి కార్మికుల తరఫున జోహార్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సభ్యులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest