UPDATES  

NEWS

పూర్వ విద్యార్థుల ఆర్థిక సహాయం ఘనంగా మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా గుర్రం జాషువా వర్ధంతి వేడుకలు దీక్షిత ధరణి అసోసియేషన్ మేనేజర్ ప్రకృతి ప్రేమికుడు శ్రీనివాస్ ను అభినందించిన భద్రాద్రి జిల్లా ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్. వివేకానంద యూత్ ఆధ్వర్యంలో బద్ది పోచమ్మ అమ్మవారికి బోనాలు కాంపెల్లి కనకేష్ అద్వర్యంలో ఎమ్మెల్సి కవిత ను మర్యాద పూర్వకంగా కలిసిన యువజన నాయకులు బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు,పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్ నివాసానికి విచ్చేసిన బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు గజమాలతో ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలు యువతి యువకులు సీత్లా పండగను ఘనంగా జరుపుకున్నారు ఘనంగా బంజారాల సీత్లా పండగ

అన్ని శాఖల సమన్వయంతో విజయవంతముగా ముగిసిన ఇంటర్ పరీక్షలు

డిఐఈఓ ను అభినందన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నిజామాబాద్ (తెలంగాణ వాణి ప్రతినిధి) నిజామాబాద్ జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించినందుకు డీ ఐ ఈ వో తిరుమల పూడి రవికుమార్ ను జిల్లా కలెక్టర్ అభినందించారు. శనివారం కలెక్టర్ ఛాంబర్ లో డిఐఈఓ తో పాటు ఇంటర్ బోర్డు అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారిని అభినందించారు.2024-25 విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా […]

జర్నలిస్ట్ ల ఇళ్ల స్థలాల పోరుకు వివిధ పార్టీల మద్దతు

కొత్తగూడెం (తెలంగాణ వాణి) జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెం జర్నలిస్టులు చేస్తున్న నిరసన కార్యక్రమానికి వివిధ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపి, మద్దతు ప్రకటించాయి. బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు నవతన్ మాట్లాడుతూ జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్ ను వెంటనే తీర్చాలని, వారికి ఉచితంగా ఇండ్ల స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అవసరమైతే వారి పక్షాన ఆమరణ దీక్ష కైన సిద్ధమని ప్రకటించారు. ఢిల్లీ నుండి గల్లి దాక నిత్యం సమాజంలో […]

ఇండ్ల స్థలాల కోసం కదం తొక్కిన విలేకరులు

ఇండ్ల స్థలాల కోసం కదం తొక్కిన విలేకరులు మద్దతు తెలుపుతున్న వివిధ సంఘాల నాయకులు కొత్తగూడెం (తెలంగాణ వాణి) కొత్తగూడెం జర్నలిస్టు కాలనీ, కొత్తగూడెం పట్టణంలోని గంగా బీషన్ బస్తి రైతు వేదిక సమీపంలో జర్నలిస్టులకు గతంలో కేటాయించిన స్థలాన్ని జర్నలిస్టు లకు అప్పగించాలని ఇళ్లస్థలాల పోరాట ఉద్యమం ప్రారంభమైంది. మండు టెండను సైతం లెక్కచేయకుండా జర్నలిస్టు మిత్రులు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. జర్నలిస్ట్ ఇండ్ల స్థలాల కోసం నిరసన దిక్ష చేస్తున్న జర్నలిస్ట్ లు సాక్షి […]

సురక్షితంగా భూమిపైకి సునీతా, బుచ్ విల్‌మోర్

హైదరాబాద్ (తెలంగాణ వాణి) నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమికి తిరిగి వచ్చారు. ఫ్లోరిడా పాన్‌హ్యాండిల్‌లోని గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో డ్రాగన్ క్యాప్సూల్ నుంచి సురక్షితంగా బయటకు వచ్చేశారు. దాదాపు 9 నెలల తర్వాత నాసా క్రూ-9 వ్యోమగాములు సునీతా విలియమ్స్, నిక్ హేగ్, బుచ్ విల్మోర్, రష్యన్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ భూమి గురుత్వాకర్షణను మొదటిసారిగా అనుభవించారు. భూమిపై గాలిని పీలుస్తూ ఆనందం వ్యక్తం చేశారు. స్పేస్‌ఎక్స్ క్యాప్సూల్ ఫ్లోరిడా పాన్‌హ్యాండిల్ […]

కుక్కల దాడిలో 22 గొర్రెల మృతి 6 గొర్రెలకు తీవ్ర గాయాలు

మెట్‌పల్లి (తెలంగాణ వాణి) మండలంలోని వేంపేట గ్రామానికి చెందిన రాచర్ల అంజయ్యకు చెందిన గొర్రెలపై కుక్కలు దాడి చేసి కరవగా 22 గొర్రెలు మృతి చెందాయి. ఆరు గొర్రెలకు తీవ్ర గాయాల పాలవగా విషయం తెలుసుకున్న బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లూరి మహేందర్ రెడ్డి పశు వైద్యాధికారికి, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వగా సంఘటన స్థలానికి వచ్చి 22 గొర్రెలు మృతిచెందినట్లు నిర్ధారించారు. ఆరు గొర్రెలకు తీవ్ర గాయాలు అవ్వగా పశు వైద్య సిబ్బంది చికిత్సను అందించారు. […]

ప్రణయ్ హత్య కేసులో నల్లగొండ కోర్టు సంచలన తీర్పు.. ఉరి శిక్ష ఖరారు

హైదరాబాద్ (తెలంగాణ వాణి ప్రతినిధి) దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ఏ1గా ఉన్న అమృత తండ్రి మారుతీరావు చనిపోవటంతో ఏ2గా ఉన్న సుభాష్ శర్మకు ఉరి శిక్ష విధించింది కోర్టు. మొత్తం ఎనిమిది మందిని దోషులుగా నిర్థారించిన కోర్టు సుభాష్ శర్మకు మరణ శిక్ష, మిగతా ఆరుగురికి జీవిత ఖైదు విధించింది. మొత్తం 78 మంది సాక్షులను విచారించిన న్యాయస్థానం అమృతను […]

భారతీయ విద్యానికేతన్ స్కూల్ మోస్ర పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

నిజామాబాద్ (తెలంగాణ వాణి) చిన్ననాడు ఆడిపాడుతూ చదువుకున్న చిన్నప్పటి స్మృతులను గుర్తుచేసుకుంటూ చదువులమ్మ ఒడిలో సందడి చేశారు. మోస్రా భారతీయ విద్యానికేతన్ హైస్కూల్ 1996-97 బ్యాచ్ విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని అపూర్వంగా జరుపుకున్నారు. చదువులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించుకున్నారు. శాలువా, పూల దండలు వేసి, మెమెంటో అందజేసి గురువులు రంగారావు అనసూయ, శివసచరణ్, హరిచర్సన్, వెంకటేష్, సంజీవ్, గోపాల్, నాగభూషణం, సాయిలు, విజేందర్, స్వరూప, పాదాలకు నమస్కరించారు. ఉదయం నుంచి డిఆర్ఆర్ ఫంక్షనల్ లో […]

విద్యతో పాటు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి : డిఈఓ అశోక్

ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు కన్నుల పండుగగా సెయింట్ జేవియర్ 42వ వార్షికోత్సవం నిజామాబాద్ (తెలంగాణ వాణి) విద్యార్థులు విద్యతోపాటు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి పార్షి అశోక్ తెలిపారు జిల్లా కేంద్రంలోని వర్ని రోడ్డులో గల సెయింట్ జేవియర్ పాఠశాల 42వ వార్షికోత్సవం కన్నుల పండుగగా శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, మండల విద్యాశాఖ అధికారి సాయిరెడ్డి రెడ్డి,లు హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన […]

గాయని మధుప్రియచే రజనీ ఫెర్టిలిటీ సెంటర్ లో లక్కీడ్రా

మగాడి విజయం వెనుక స్త్రీ, స్త్రీ శక్తి వెనుక పురుషుడు ఉండాల్సిందే : గాయని మధు ప్రియ కరీంనగర్ మార్చి 08 (తెలంగాణ వాణి) ప్రతి మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉన్నట్లే, ప్రతి మహిళ శక్తి వెనుక పురుషుడి హస్తం తప్పనిసరి అని ప్రముఖ గాయని మధు ప్రియ అన్నారు. శనివారం స్థానిక రెనీ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలో రజని సంతాన సాఫల్య కేంద్రం ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై […]

క్యాన్సర్ ప్రాణంతక వ్యాధి కాదు

మొదటి దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చు సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సోమ శ్రీకాంత్ నిజామాబాద్ (తెలంగాణ వాణి ప్రతినిధి) క్యాన్సర్ ప్రాణాంతకమైన వ్యాధి కాదని దానిని మొదటి దశలోనే గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చని చివరి దశలో గనుక గుర్తించినట్లయితే సర్జరీల ద్వారా నయం చేయవచ్చని యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ ఆంకాలజిస్ట్ సర్జికల్ డాక్టర్ సోమ శ్రీకాంత్ అన్నారు శుక్రవారం జిల్లా కేంద్రంలోని యశోద హాస్పిటల్స్ అనుబంధ సంస్థ లో విలేకరుల […]