UPDATES  

NEWS

జర్నలిస్టు కాలనీకి మౌలిక సదుపాయాలు త్వరలో కల్పిస్తాం.. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ గడల శ్రీనివాసరావు ఒకే వేదికపై రాష్ట్రస్థాయి అవార్డులు అందుకున్న తండ్రీ కన్నా కూతురు పారుల్ అత్యాధునిక ఎక్మో చికిత్సతో 23 ఏళ్ల యువతికి పునర్జన్మ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డితో కలిసి మొక్క నాటిన విశ్వామిత్ర చౌహాన్ ఖానంపల్లి ఎఫ్ఎన్ టి, భూ సేకరణకు 5.40 కోట్ల నిధులు విడుదల ఘనంగా సర్ధార్ సర్వాయి పాపన్న జయంతి రామయ్యపల్లిలో పంట కుంట పనులు ప్రారంభించిన సర్పంచ్ జర్నలిస్టుల హక్కుల సాధనకు టీయూడబ్ల్యూజే నిరంతర కృషి ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

 గెలుపు దిశగా “పల్లపోతు”

54వ డివిజన్ లో భాగ్యం ను వరించనున్న విజయం

భారీ మెజార్టీ దిశగా సిపిఐ అభ్యర్థిని భాగ్యలక్ష్మి 

కొత్తగూడెం (తెలంగాణ వాణి) పేరుకు తగ్గట్లుగా నే 54వ డివిజన్ సిపిఐ అభ్యర్థి భాగ్యలక్ష్మిని విజయభాగ్యం వరించనుంది. రేపు జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో సిపిఐ అభ్యర్థిని పల్లపోతు భాగ్యలక్ష్మి అత్యధిక మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. భాగ్యలక్ష్మి భర్త పల్లపోతు సాయి ప్రముఖ వ్యాపారవేత్త కావడంతో ఆ ప్రాంత ప్రజల అందరితో సత్సంబంధాలు ఉన్నాయి. సామాజిక వర్గాల సమీకరణలను ముందుగానే సమీక్షించుకున్న అభ్యర్థి అన్ని వర్గాల ఓటర్లను నేరుగా కలిసి తనకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా అభ్యర్థించారు. ఆదివారం డివిజన్ వ్యాప్తంగా నిర్వహించిన ర్యాలీకి విశేష స్పందన లభించడంతో గెలుపు తీరాలు చేరడం సునాయాసమే అని తేలిపోయింది. ఆ డివిజన్ వ్యాప్తంగా మొత్తం 2234 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళా ఓటర్లు 1189 మంది, పురుష ఓటర్లు 1045 మంది ఉండగా కాగా ఇక్కడ 144 మంది మహిళా ఓటర్లు ఎక్కువ. 750 మంది మైనార్టీ ఓటర్లు ఉన్న ఈ డివిజన్ లో గెలుపు ఓటములను మైనార్టీలే శాసించే అవకాశం ఉంది. మైనారిటీలు అగ్రభాగాన పల్లపోతు వెంట ఉండటం విశేషం. కాంగ్రెస్, బియర్ఎస్ అభ్యర్థులు పోటీ  పడుతునప్పటికి ఓటర్లు పల్లపోతు వైపు చూస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ డివిజన్లో మొదటి నుండి బలమైన పోటీ ఉంటుందని భావించినప్పటికీ రోజురోజుకి మారిన సమీకరణాలతో 54వ డివిజన్ సిపిఐ ఖాతాలో పడనుంది. మొత్తoగా 20% ఓట్ల మెజార్టీతో సిపిఐ అభ్యర్థి పల్లపోతు భాగ్యలక్ష్మి గెలిచే అవకాశాలు సుష్పష్టంగా కనిపిస్తున్నాయి.

Editor Reporter
telanganavanidaily.com

Share ePaper Clip

Preparing image...

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest