UPDATES  

NEWS

నూతన జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన టిఎస్ యు.టి.ఎఫ్ భద్రాది జిల్లా కమిటి 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐడిఓసి నందు తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిసి,పూల బోకేతో స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యారంగ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్ మరియు డైరీని అందజేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బి.రాజు,జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు,జిల్లా కార్యదర్శి ఎస్కే పాషా,పాల్వంచ మండల […]

సేవాలాల్ సద్గురు చూపిన మార్గం ఆదర్శనీయం: వైరా ఎమ్మెల్యే మాళోత్ రాందాస్ నాయక్

గిరిజన లంబాడీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (GLS JAC) ఆధ్వర్యంలో సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. GLS JAC చైర్మన్ ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ అధ్యక్షతన లక్ష్మీదేవి పల్లి మార్కెట్ యార్డ్ నుండి రైల్వే స్టేషన్ మీదుగా ఎదురుగడ్డ వరకు లంబాడీ సంస్కృతి, సంప్రదాయ నృత్యాల నడుమ భారీ శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం లక్ష్మీదేవి పల్లి మండలం ఎదురుగడ్డలో మహా భోగ్ భండారో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి […]

పిడి బుగ్గ వెంకటేశ్వర్లు పదవీ విరమణ సందర్భంగా సన్మానించిన పి ఆర్ టి యు టి ఎస్ భద్రాద్రి జిల్లా కమిటీ

టేకులపల్లి మండలం ఏహెచ్‌ఎస్ గంగారం పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులుగా సేవలందించిన పిడి బుగ్గ వెంకటేశ్వర్లు పదవీ విరమణ సందర్భంగా ఆయన స్వగృహంలో సన్మానం చేసిన పిఆర్.టి.యు.టిఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు పి. నరసయ్య. జిల్లా మరియు మండల స్థాయి సంఘ నాయకులు కూడా పాల్గొని పి డి చేసిన విద్యా సేవలను కొనియాడారు. విద్యార్థుల అభ్యున్నతికి ఆయన చూపిన అంకితభావం, క్రమశిక్షణ, నిబద్ధత ఆదర్శప్రాయమని నాయకులు పేర్కొన్నారు..కార్యక్రమంలో జిల్లా,మండల సంఘ నాయకులు పాల్గొన్నారు.

హర్ష టౌన్షిప్‌లో టీఎస్ టిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోత్ రాములు నాయక్ ఆధ్వర్యంలో మేయర్, కార్పొరేటర్‌ లకు ఘన సన్మానం

పాల్వంచ మండలం హర్ష టౌన్షిప్ లో టీఎస్ టిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోత్ రాములు నాయక్ అధ్యక్షతన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ చౌహన్ మరియు 31వ డివిజన్ కార్పొరేటర్ నునావత్ శ్యామల దినేష్‌లకు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం బానోత్ రాములు నాయక్ స్వగృహంలో జరిగింది.ఈ సందర్భంగా టౌన్షిప్‌లో నెలకొన్న సమస్యలను మేయర్ దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రాన్ని అందజేశారు. దీనిపై స్పందించిన మేయర్ సంబంధిత సహాయ ఇంజనీర్‌తో చరవాణి ద్వారా మాట్లాడుతూ.. సీసీ […]

సాంబమూర్తి దేవాలయ అభివృద్ధి కమిటీ ఏకగ్రీవం  ధర్మారం (తెలంగాణ వాణి ) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని రచ్చపల్లి గ్రామంలో ఉన్న సాంబమూర్తి దేవాలయ అభివృద్ధి కమిటీ ని ఆదివారం స్థానిక సర్పంచ్ సూర రజిత వెంకటేశం ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యేక సమావేశమై నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చైర్మన్ గా కోలా వెంకటేశం, వైస్ చైర్మన్ గా పెరిక మహేష్, ప్రధాన కార్యదర్శిగా బైరి మహేష్, కోశాధికారిగా మోర గణపతి, చింతల సూర్య ప్రకాష్, ప్రచార […]

లక్ష్మీదేవిపల్లిలో వీధి దీపాల ఏర్పాట్లు వేగవంతం: సర్పంచ్ తాటి అనిత

లక్ష్మీదేవి పల్లి మండలంలో నూతన పాలకవర్గం అభివృద్ధి పనుల్లో వడివడిగా ముందుకు సాగుతోంది.ఈ క్రమంలో లక్ష్మీదేవిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ తాటి అనిత పర్యవేక్షణలో ప్రకృతి వనం సమీపంలోని చాతకొండ రోడ్డుపై నూతన వీధి దీపాల ఏర్పాటు పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి.పాదచారులు,వాహన దారులకు రాత్రివేళల్లో ఇబ్బందులు లేకుండా శాశ్వత విధి దీపాలను ఏర్పాటు చేయడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తూ సర్పంచ్‌ను అభినందిస్తున్నారు.ఈ పనులకు సహకారం అందించిన సంజయ్ నగర్ సర్పంచ్ తాటి బాలకృష్ణకు ధన్యవాదాలు తెలిపారు.

56వ డివిజన్‌లో మెగా మెడికల్ క్యాంపు..ఉచిత మందుల పంపిణీ

కొత్తగూడెం కార్పొరేషన్ 56వ డివిజన్ పరిధిలోని శ్రీ వెంకటరమణ ఆయుర్వేదిక్ హాస్పిటల్ లో ఆదివారం మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు.డాక్టర్ రమేష్ బాబు, డాక్టర్ రాయపాటి మానస, డాక్టర్ వేణు ఆహ్వానం మేరకు కొత్తగూడెం కార్పొరేషన్ 56వ డివిజన్ కాంగ్రెస్ నాయకురాలు, మాజీ 24వ వార్డు కౌన్సిలర్ బాలశెట్టి సత్యభామ క్యాంపును సందర్శించారు. వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లను ఆమె సన్మానించారు.ఈ సందర్భంగా […]

హమాలికాలనీ గ్రామంలో కొత్త కరెంటు పోల్స్‌పై వీధి దీపాల ఏర్పాటు లక్ష్మీదేవిపల్లి

లక్ష్మీదేవిపల్లిమండలం హమాలికాలనీ గ్రామపంచాయతీలో నూతనంగా ఏర్పాటు చేసిన కరెంటు పోల్స్‌పై వీధి దీపాలను అమర్చే పనులు కొనసాగుతున్నాయని సర్పంచ్ గుగులోత్ ప్రేమిందర్ నాయక్ తెలిపారు.గ్రామంలోని అన్ని వీధుల్లో పూర్తి స్థాయిలో వెలుగును నింపేలా వీధిలైట్లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తాళ్లపల్లి రాజు,వార్డు సభ్యులు మరియు పంచాయతీ సెక్రటరీ పాల్గొన్నారు.గ్రామ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలను దశలవారీగా కల్పిస్తామని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు.

బాలమేళాలో రాజాపురం పాఠశాల విద్యార్థుల ప్రతిభ

రాజాపురం ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సమూహ స్థాయి బాలమేళాలో అద్భుత ప్రతిభ కనబరిచి మూడు బహుమతులు సాధించారు.వి.విరుక్ష (మొదటి తరగతి) మొదటి బహుమతి,కె. స్మైలిక (ఐదవ తరగతి) మొదటి బహుమతి, వి. మనన్య రామ్ (రెండవ తరగతి) రెండవ బహుమతి సాధించి పాఠశాలకు గౌరవం తీసుకొచ్చారు. ఉపాధ్యాయులు రాంప్రసాద్,రాంబాబు సమర్థ మార్గదర్శకత్వం, తల్లిదండ్రుల సహకారం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని పాఠశాల వర్గాలు తెలిపారు. విశేష కృషి చేసిన విద్యార్థులను గ్రామ సర్పంచ్ వజ్జ రామకృష్ణ, పంచాయతీ […]

ఖమ్మంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లో ఘనంగా సైన్స్ దినోత్సవం

స్థానిక ఖమ్మం ఎన్టీఆర్ సర్కిల్‌లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లో సర్ సి.వి. రామన్ జయంతిని పురస్కరించుకొని జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులు సైన్స్ ప్రాజెక్టులు,మోడళ్లను ప్రదర్శించి తమ సృజనాత్మకతను చాటుకున్నారు. శాస్త్ర విజ్ఞానం నిత్య జీవితంలో ఎంతో ఉపయోగ పడుతుందని ఉపాధ్యాయులు వివరించారు.సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు.ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య ఇన్‌స్టిట్యూషన్స్ చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య,డీజీఎం చేతన్ మాధుర్,ప్రిన్సిపాల్ నివేదిత,వైస్ ప్రిన్సిపాల్ యాచమనేని […]