UPDATES  

NEWS

ప్రజా సమస్యల పై ప్రత్యేక దృష్టి..సర్పంచ్ అజ్మీర లైలా

లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతినగర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ అజ్మీర లైలా గ్రామంలోని వీధి వీధి తిరుగుతూ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుంటున్నారు.తాగునీరు, డ్రైనేజీ,విద్యుత్, రహదారుల వంటి సమస్యలపై స్థానికులతో మాట్లాడి వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని చరవాణి ద్వారా సంబంధిత అధికారులకు సూచించారు. గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ప్రజలతో నేరుగా మమేకమై సమస్యల పరిష్కారానికి కృషి చేయడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. కార్యక్రమంలో పాలక వర్గం సభ్యులు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు

గిరిజన బాలలాజీ స్వామివారి కళ్యాణంకు హాజరైన:గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి. హాథీరామ్ నాయక్ 

గంగారం గ్రామపంచాయతీ పరిధిలోని సంపత్ నగర్‌లో గిరిజన బాలలాజీ స్వామివారి ఆలయంలో కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు కొండపల్లి గోపాలకిషన్, రజిత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అర్చకులు అక్కినపల్లి సోమాచార్యులు, యజ్ఞికులు రంగం అజయ్ కుమార్, సాయి చక్రి చార్యులు స్వామివారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని ఇస్లావత్ బాలు బృందం సమన్వయం చేశారు. ఈ వేడుకలో గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి. హాథీరామ్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.స్వామివారి […]

మండల స్థాయి బాల్ మేళా 2.0 ఘన విజయవంతం, అభినందించిన ఎంఇఓ సూరయ్య

స్థానిక చంద్రుగొండ మండల పరిధిలోని మూడు కాంప్లెక్స్‌ల పరిధిలో చంద్రుగొండ రేపల్లెవాడ, పోకులగూడెం కేంద్రాల్లో బాల మేళా 2.0 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మండల విద్యాశాఖ అధికారి సురయ్య, చంద్రుగొండ కాంప్లెక్స్ హెచ్ఎం ఉప్పల్ రెడ్డి,రేపల్లెవాడ కాంప్లెక్స్ హెచ్ఎం రామచందర్ ఆధ్వర్యంలో కార్యక్రమం విజయవంతంగా జరిగింది.లైబ్రరీ, స్టోరీ టెల్లింగ్ విభాగాల్లో ప్రతి తరగతి నుంచి ఒక్కో విద్యార్థిని ఎంపిక చేసి మండల స్థాయికి పంపించారు. మూడు సబ్జెక్టుల్లో నిర్వహించిన పరీక్షల్లో మొదటి స్థానం సాధించిన విద్యార్థులకు గోల్డ్ […]

కాకతీయ కాలంనాటి శ్రీ మోక్ష వెంకటేశ్వర స్వామి ఆలయ పునఃప్రతిష్ట

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం గుడిపాడు రామచంద్రాపురం గ్రామంలోని కాకతీయ కాలంనాటి శ్రీ మోక్ష వెంకటేశ్వర స్వామి ఆలయ పునఃప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది.శ్యామల గోపాలన్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ చైర్మన్ ఎన్. సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జీఎల్‌ఎస్–జేఏసీ భద్రాద్రి జిల్లా కమిటీ హాజరై స్వామిని దర్శించుకుంది.ముఖ్య అతిథులుగా శ్రీలంక సుప్రీంకోర్టు న్యాయమూర్తి తురాజ్ రాజాజీ, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబిర్ పాషా, కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడు గణేష్, జీఎల్‌ఎస్–జేఏసీ చైర్మన్ […]

అలాంటి ఉపాధ్యాయులను తొలగించాల్సిందే..?? CM రేవంత్‌కు విద్యా కమిషన్ సూచన.!

తెలంగాణ సర్కార్‌కు విద్యా కమిషనర్ కీలక సూచనలు చేసింది. ఉపాధ్యాయుల ఆటోమేటిక్ పదోన్నతులు రద్దుకు సూచనలు చేసింది. పనితీరు ఆధారంగానే ప్రమోషన్లు ఇవ్వాలని పేర్కొంది.దాంతో పాటు ఐదేళ్లకోసారి ఉపాధ్యాయుల పనితీరు అంచనా తప్పనిసరి అని స్పష్టం చేసింది. రెండేళ్లలో మెరుగుపడకపోతే ఏకంగా సర్వీసు నుంచి తొలగించాలని సూచించింది. ఇకపై నియమించే ఉపాధ్యాయులకూ కొత్త నిబంధనలు సూచించింది.నర్సరీ నుంచి యూనివర్సిటీ వరకు ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేసింది.డీఈఐఈడీ కోర్సు రద్దు చేయాలని తెలిపింది.మరోవైపు..విద్యావ్యవస్థలో సమూల మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం […]

గిరిజన సంక్షేమ భాషా పండితుల, వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులను అప్గ్రేడ్ చేయాలి: టిపిటిఎఫ్

గిరిజన సంక్షేమ శాఖలో ద్వితీయ శ్రేణి భాషా పండితులను, వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులను ఉన్నతీకరించాలని, గిరిజన సంక్షేమ పాఠశాలల, ఉపాధ్యాయుల మరియు విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టిపిటిఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షులు బుటారి రాజు ప్రభుత్వాన్ని కోరారు. గత కొన్ని సంవత్సరాలుగా గిరిజన సంక్షేమ విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం వివక్షతను ప్రదర్శిస్తున్నాయని, సమస్యలపై ఎన్ని మార్లు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ అధికారులు, ప్రభుత్వం పట్టించుకోకపోవడమే అందుకు నిదర్శనమని విద్యా శాఖలో […]

అంతర్జాతీయ మహిళా దినోత్సవం విజయవంతం చేయాలి: జిల్లా కార్యదర్శి ఎస్.శైలజ

టీఎస్ యుటిఎఫ్ భద్రాది కొత్తగూడెం జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి ఎస్ శైలజ పిలుపునిచ్చారు.భద్రాచలం ప్రాంతీయ కార్యాలయంలో జిల్లా మహిళా కార్యదర్శి టి చిన్నక్క అధ్యక్షతన నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళల హక్కులు, సాధికారత, సమానత్వంపై అవగాహన కల్పించే కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. అన్ని మండలాల నుండి మహిళా ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. […]

మైనర్,మానసిక రోగి పై అత్యాచారం, వ్యక్తికి 20 సంవత్సరముల కఠిన కారాగార శిక్ష

కొత్తగూడెం లీగల్:: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ( ఫోక్సో స్పెషల్ సెషన్స్ జడ్జి) ఎస్.సరిత సోమవారం తీర్పు చెప్పారు. కేసు వివరాలు ఇలా…. బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామము కు చెందిన ఇడ్డీ రంగా తన ఫిర్యాదులో 2019 మార్చి 19 న బూర్గంపాడు పోలీసు వారికి ఇచ్చిన ఫిర్యాదులో తన తమ్ముడు ఇడి భాస్కర్ తన మరదలు అరుణలు మరణించిన కారణంగా వారి మైనర్ పిల్లలు కుమార్తె ,కుమారుడు తన […]

తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుమారుడి వివాహానికి ఆహ్వానం

2026 మార్చి 5వ తేదీన హైదరాబాద్ నగరంలో నిర్వహించనున్న భట్టి విక్రమార్క గారి కుమారుడు సూర్య విక్రమ్ ఆదిత్య వివాహ వేడుకల ఆహ్వాన పత్రికను జూలూరుపాడు మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు గుగులోతు ప్రియాంక నాయక్ గారికి అందజేశారు.ఈ కార్యక్రమంలో జూలూరుపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంగీలాల్ నాయక్, మండల సేవాదళ్ అధ్యక్షులు వాంకుడోత్ కిషన్ నాయక్, ఓబీసీ మండల అధ్యక్షులు గోపు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) లీగల్,హ్యూమన్ రైట్స్ & ఆర్‌టీఐ విభాగం రాష్ట్ర కన్వీనర్‌గా అడ్వకేట్ మారపాక రమేష్ కుమార్ నియామకం

కొత్తగూడెం లీగల్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) లీగల్,హ్యూమన్ రైట్స్ & ఆర్‌టీఐ విభాగం రాష్ట్ర కన్వీనర్ గా కొత్తగూడెం పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది మారపాక రమేష్ కుమార్ ను నియమిస్తూ రాష్ట్ర చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ సోమవారం నియామకపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా పొన్నం అశోక్ గౌడ్ మాట్లాడుతూ,న్యాయరంగంలో అనుభవం కలిగిన రమేష్ కుమార్ పార్టీ లీగల్ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.మానవ హక్కుల పరిరక్షణ,బలహీన వర్గాలకు న్యాయ […]